ధమ్కీ ఇచ్చేది అప్పుడే..
ABN , First Publish Date - 2023-03-11T00:47:44+05:30 IST
విశ్వక్‌సేన్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఆయనే స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

విశ్వక్‌సేన్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఆయనే స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నివేదా పేతురాజ్ కథానాయిక. ఈనెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఆదివారం ట్రైలర్ ఆవిష్కరిస్తారు. ఈ సినిమాలో విశ్వక్ రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఓ పాత్ర మాస్ అయితే, మరోటి క్లాస్. ఈ రెండు పాత్రలకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది సస్పెన్స్. ఇప్పటికే విడుదల చేసిన పాటలకు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. త్వరలోనే ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌కి ఎన్టీఆర్ అతిథిగా వస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రావు రమేశ్, హైపర్ ఆది, రోహిణి, ఫృథ్వీ రాజ్ కీలక పాత్రలు పోషించారు.