Ala Ila Ela: లారెన్స్ వదిలిన ‘దాక్కో దాక్కో’ ఐటమ్..

ABN , First Publish Date - 2023-07-12T22:23:53+05:30 IST

దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్ హీరోగా నటించిన చిత్రం ‘అలా ఇలా ఎలా’. రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించారు. ఈ చిత్రంలోని ‘దాక్కో దాక్కో’ అనే లిరికల్ సాంగ్‌ని కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Ala Ila Ela: లారెన్స్ వదిలిన ‘దాక్కో దాక్కో’ ఐటమ్..
Ala Ila Ela Movie Song Launch

దర్శకుడు పి.వాసు (P Vasu) తనయుడు శక్తి వాసుదేవన్ (Shakti Vasudevan) హీరోగా రాజ్ శంకర్, పూర్ణ, నాగబాబు, బ్రహ్మానందం, అలీ, సీత, సితార, నిషా కొఠారి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘అలా ఇలా ఎలా’ (Ala Ila Ela). రాఘవ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు నిర్మించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన పాటలను ఇటీవలే హిందూపూర్‌లో అంగరంగవైభవంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో థర్డ్ లిరికల్ సాంగ్‌ను కొరియోగ్రాఫర్, దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్ (Raghava Lawrence) విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘దాక్కో దాక్కో’ అంటూ సాగిన ఈ పాట సినిమాలో ఐటమ్ సాంగ్‌లా అనిపిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ నిషా కొఠారి (Nisha Kothari) ఈ ఐటమ్ సాంగ్‌లో దర్శనమిచ్చింది.


పాట విడుదల అనంతరం రాఘవ లారెన్స్ మాట్లాడుతూ.. కళ మూవీ మేకర్స్ పతాకంపై కొల్లకుంట నాగరాజు (Kollakunta Nagaraju) నిర్మించిన చిత్రం ‘అలా ఇలా ఎలా’. ఈ సినిమాని నేను చూశాను. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. నేను విడుదల చేసిన ఈ పాట కూడా చాలా బాగుంది. భాస్కరభట్ల (Bhaskarabhatla)గారు ఈ పాటకి లిరిక్స్ అందించారు. సినిమా మంచి హిట్ అవుతుంది. ఈ చిత్రంలో శక్తి చాలా బాగా నటించాడు. పాటలో కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. జులై 21న ఈ సినిమా ఎస్.కె.ఎం.ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా విడుదల అవుతోంది. అందరూ సినిమాని చూసి సూపర్ హిట్ చేయండి. యూనిట్‌కు నా శుభాకాంక్షలు అని తెలిపారు. (Dakkho Dakkho Lyrical Song From Ala ila Ela)


ఇవి కూడా చదవండి:

**************************************

*Rashmika Mandanna: నితిన్, వెంకీ కుడుమల కాంబో ఫిల్మ్ నుంచి రష్మిక ఔట్.. కారణం ఏంటంటే?

**************************************

*Kavya Kalyanram: నేనలా ఎక్కడా చెప్పలేదు.. దయచేసి ఆ వార్తలు ఆపండి

**************************************

*Kushi Song: ‘ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య’.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..

**************************************

*Gandheevadhari Arjuna: అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా..

**************************************

*Mahaveerudu: ‘మహావీరుడు’‌కి మాస్ మహారాజా సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?

**************************************

Updated Date - 2023-07-12T22:23:53+05:30 IST