Cinematica Expo: ముగిసిన ఇండియా జాయ్ సినిమాటిక ఎక్స్‌పో.. విజువల్ స్టోరీ టెల్లర్స్ బుక్ విడుదల

ABN , First Publish Date - 2023-11-04T23:13:16+05:30 IST

ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక ఎక్స్‌పో వేడుకలు హైదరాబాదులోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్‌లో ఘనంగా ముగిశాయి. సోనీ జైస్‌తో పాటు చాలా కంపెనీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సినిమాటోగ్రఫీ ఫిలిం మేకింగ్‌లోని 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన ఎక్విప్మెంట్‌ని ప్రదర్శించాయి.

Cinematica Expo: ముగిసిన ఇండియా జాయ్ సినిమాటిక ఎక్స్‌పో.. విజువల్ స్టోరీ టెల్లర్స్ బుక్ విడుదల

ఇండియా జాయ్, ఫ్లయింగ్ మౌంటెయిన్ కాన్సెప్ట్స్ సమర్పణలో సినిమాటిక ఎక్స్‌పో వేడుకలు హైదరాబాదులోని హెచ్ఐసీసీ నోవాటెల్ హోటల్‌లో ఘనంగా ముగిశాయి. సోనీ జైస్‌తో పాటు చాలా కంపెనీలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సినిమాటోగ్రఫీ ఫిలిం మేకింగ్‌లోని 24 క్రాఫ్ట్స్‌కి సంబంధించిన ఎక్విప్మెంట్‌ని ప్రదర్శించాయి. ఈ సినిమాటిక ఎక్స్‌పోను దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ, మెహర్ రమేష్‌తో పాటు మరికొంత మంది దర్శకులు.. సినిమాటోగ్రాఫర్స్ కేకే సెంథిల్ కుమార్, ఎస్ గోపాల్ రెడ్డి, అజయ్ విన్సెంట్, ఎంవి రఘు వంటి వారెందరో వీక్షించారు. సినిమాటిక ఎక్స్‌పో ముగింపు వేడుకలో భాగంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ బయోగ్రఫీని తెలియజేస్తూ విజువల్ స్టోరీ టెల్లర్స్ (Visual Story Tellers) అనే పుస్తకావిష్కరణ మామిడి హరికృష్ణ, ఇంద్రగంటి మోహన కృష్ణ చేతుల మీదుగా జరిగింది.

ఈ సందర్భంగా మామిడి హరికృష్ణ (Mamidi Harikrishna) మాట్లాడుతూ.. మనిషి సామాజిక జీవన పరిణామంలో ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ అత్యంత గొప్ప సాంకేతిక ఆవిష్కరణలుగా పరిగణించాలి అని చెప్పారు. విజువల్ స్టోరీ టెల్లర్స్ పుస్తకం గురించి మాట్లాడుతూ మన తెలుగు సినిమా హైదరాబాద్ వేదికగా ప్రపంచ స్థాయికి ఎదగడానికి మన సినిమాటోగ్రాఫర్స్ కృషి ఎంతో ఉందని కొనియాడారు. వారి కృషిని, కళని మేళవించి ఈ విజువల్ స్టోరీ టెల్లర్స్ పుస్తకంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ బయోగ్రఫీని, వారి సినిమాలలోని గొప్ప షార్ట్స్‌ని అన్వయించి కళాత్మకంగా తీర్చిదిద్దారని తెలిపారు.


Cinematica.jpg

ఇంద్రగంటి మోహన కృష్ణ (Indraganti Mohanakrishna) మాట్లాడుతూ.. ఈ పుస్తకం ఔత్సాహిక సినిమాటోగ్రాఫర్స్ అందరికీ ఎంతో ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. విజువల్ స్టోరీ టెల్లర్స్ పుస్తక రూపకల్పనను పీ.జీ విందా చేశారు. ఇల్యుస్టేషన్ ఆర్ట్ సురేంద్ర చాచా, ఎడిటింగ్ అండ్ కంపైలింగ్‌ను యం. కమల్ నాబ్ అందించారు. విజువల్ స్టోరీ టైలర్స్ పుస్తక ప్రచురణను లాంగ్వేజెస్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ సపోర్టింగ్ విందా ప్రొడక్షన్స్ కలిసి చేశాయి. పుస్తకావిష్కరణ తర్వాత సినిమాటిక అవార్డ్ (Cinematica Award) వేడుక జరిగింది. ఈ అవార్డులను ఎస్. గోపాల్ రెడ్డి, కే.కే. సెంథిల్ కుమార్, బైరాన్ జోషి, మైక్, అజయ్ విన్సెంట్ అవార్డులను ప్రధానం చేశారు.

సినిమాటిక ఐకానిక్ విజనరీ అవార్డు కే.కే సెంథిల్ కుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్, కేయం. రాధాకృష్ణన్, ఎస్. రామకృష్ణ అందుకున్నారు. హానరరీ సినిమాటిక ఎక్స్లెన్స్ అవార్డు సి.వి రావు, తారక్ శ్రీనివాస్ అందుకున్నారు. సినిమాటిక ఎక్స్లెన్స్ అవార్డు బివిఆర్, శివకుమార్ అందుకున్నారు. సినిమాటిక గోల్డెన్ స్పార్కిల్ అవార్డు కార్తీక్ దండు, హన్సితా రెడ్డి, హర్షితా రెడ్డి, బీమ్స్ సిసిరిలోయో, ఆచార్య వేణు, జస్విన్ ప్రభు, శ్రీ నాగేంద్ర తంగల, ఎం. రాజు రెడ్డి అందుకున్నారు. సినిమాటిక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఎస్. గోపాల్ రెడ్డి, కమల్ కిషోర్ మోహన్ కద్వానీ, కే. బసిరెడ్డి అందుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దామోదర్ ప్రసాద్, కె.ఎస్.రామారావు, జెమినీ కిరణ్, శివ నిర్వాణ తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Natti Kumar: వైసీపీలో ఉన్నప్పుడు ఒక్క కాల్ రాలేదు.. చంద్రబాబు, పవన్‌లకు మద్దతు ఇవ్వగానే..?

**********************************

*Hi Nanna: ‘అమ్మాడి’ పాటతో కట్టిపడేస్తోన్న అమ్మాడి..

**********************************

*Atharva: ఫస్ట్ టైమ్ క్లూస్ టీమ్‌పై సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్సయింది

**********************************

*Kannappa: మంచు విష్ణు ‘కన్నప్ప’కు ‘జవాన్, బాహుబలి’ టచ్..

*************************************

Updated Date - 2023-11-04T23:14:54+05:30 IST