Cheater: ‘చీటర్’ సిద్ధం

ABN , First Publish Date - 2023-09-17T22:43:36+05:30 IST

చంద్రకాంత్ దత్త, నరేందర్, రేఖ నిరోషా హీరోహీరోయిన్లుగా యస్.ఆర్.ఆర్ ప్రొడక్షన్ పతాకo‌పై పరుపాటి శ్రీనివాసరెడ్డి నిర్మాతగా, బర్ల నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చీటర్’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది.

Cheater: ‘చీటర్’ సిద్ధం

చంద్రకాంత్ దత్త, నరేందర్, రేఖ నిరోషా హీరోహీరోయిన్లుగా యస్.ఆర్.ఆర్ ప్రొడక్షన్ పతాకo‌పై పరుపాటి శ్రీనివాసరెడ్డి నిర్మాతగా, బర్ల నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘చీటర్’. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా విడుదల చేసిన చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుండటంతో దర్శకనిర్మాతలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Cheater-2.jpg

ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. మేము అనుకున్నట్లుగా సినిమా చాలా బాగా వచ్చింది. మా డైరెక్టర్ అనుకున్న దానికంటే బాగా కష్టపడి పనిచేశారు. మంచి అవుట్ పుట్ వచ్చింది, ప్రేక్షకులకు పక్కాగా నచ్చుతుంది. ఇప్పటికే 12 లక్షల పైన ప్రేక్షకులు మా ట్రైలర్‌ని వీక్షించారు. సెప్టెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకం ఉందని తెలపగా.. డైరెక్టర్ నారాయణ మాట్లాడుతూ, సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా మా సినిమా ఉంటుంది. ప్రేక్షకులకు పక్కాగా నచ్చుతుంది. అందరూ ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Updated Date - 2023-09-17T22:43:36+05:30 IST