భలే బాగుంది... జిలేబీ
ABN , First Publish Date - 2023-08-13T00:39:04+05:30 IST
శ్రీకమల్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం ‘జిలేబీ’. కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. గుంటూరు రామకృష్ణ నిర్మాత. ఈనెల 18న విడుదల చేస్తున్నారు...

శ్రీకమల్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం ‘జిలేబీ’. కె.విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. గుంటూరు రామకృష్ణ నిర్మాత. ఈనెల 18న విడుదల చేస్తున్నారు. శుక్రవారం ట్రైలర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్ని అందించిన విజయ్ భాస్కర్ మరోసారి పూర్తి వినోదాత్మక కథతో ‘జిలేబీ’ రూపొందించారు. ఆయన తనయుడ్ని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నారు. విజయ్ భాస్కర్ మార్క్ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంద’’న్నారు.