సంగీత దర్శకుడిగా మారుతున్నా

ABN , First Publish Date - 2023-02-25T04:15:02+05:30 IST

‘దాసరి నారాయణరావు గారి ప్రోత్సాహంతో నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. ఆయన సినీ రచయితగా నాకు తొలి అవకాశం ఇచ్చారు’ అని...

సంగీత దర్శకుడిగా మారుతున్నా

‘దాసరి నారాయణరావు గారి ప్రోత్సాహంతో నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. ఆయన సినీ రచయితగా నాకు తొలి అవకాశం ఇచ్చారు’ అని వరంగల్‌ శ్రీనివాస్‌ అన్నారు. నటుడు, గాయకుడు, పాటల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ‘తారకాసుర’ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారుతున్నారు. వి. సమద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఈ సందర్భంగా వరంగల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘దాసరి నారాయణరావు, ఆర్‌. నారాయణమూర్తి నన్ను బాగా ప్రోత్సహించారు. వారి సినిమాల్లో నేను రాసిన ఉద్యమ గీతాలు ప్రేక్షకాధరణ పొందాయి. పలు భాషల్లో పాటలు రాశాను, పాడాను. ఇప్పుడు తారకాసుర చిత్రం పాటల కోసం ప్రయోగాలు చేసి కొత్త తరహా బాణీలు సమకూర్చాను. ఈ సినిమా పాటలు మంచి హిట్టవుతాయని నమ్మకం ఉంది’ అన్నారు.

Updated Date - 2023-02-25T04:15:04+05:30 IST