Band Melam : ఫిబ్రవరిలో మోగనున్న బ్యాండ్‌ మేళం

ABN , Publish Date - Dec 27 , 2023 | 05:47 AM

సుహాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’. ఇందులో మ్యారేజ్‌ బ్యాండ్‌ లీడర్‌ మల్లి పాత్రను ఆయన పోషిస్తున్నారు.

Band Melam : ఫిబ్రవరిలో మోగనున్న బ్యాండ్‌ మేళం

సుహాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’. ఇందులో మ్యారేజ్‌ బ్యాండ్‌ లీడర్‌ మల్లి పాత్రను ఆయన పోషిస్తున్నారు. దుష్యంత్‌ కటికినేని ఈ చిత్రానికి దర్శకుడు. కామెడీ డ్రామా కథతో రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదిన నిర్మాతలు మంగళవారం ప్రకటించారు. ఫిబ్రవరి రెండున రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. వైవిధ్యమైన కథ, కథనాలతో తెరకెక్కిన ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని దర్శకుడు చెప్పారు. శివాని నాగరం, శరణ్య, ప్రదీప్‌, ప్రతాప్‌ భండాలరి, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర, సినిమాటోగ్రఫీ: వాజిద్‌ బేగ్‌, ఎడిటింగ్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌.

Updated Date - Dec 27 , 2023 | 05:47 AM