Balagam: ఉత్తమ నటుడు సాయిలు, ఉత్తమ సహనటుడు కొమురయ్య.. మరో ప్రతిష్టాత్మక అవార్డ్
ABN , First Publish Date - 2023-05-08T16:50:19+05:30 IST
‘బలగం’ సినిమా ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలతో పాటు.. కలెక్షన్స్‌ను అదే రేంజ్‌లో రాబట్టింది. వర్డ్ ఆఫ్ మౌత్ టాక్‌తో ఈ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా..
నిర్మాత దిల్ రాజు (Dil Raju) సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ (Dil Raju Productions) బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి (Harshith Reddy), హన్షిత (Hanshitha) నిర్మాతలుగా రూపొందించిన చిత్రం ‘బలగం’ (Balagam). కమెడియన్ వేణు ఎల్దండి (Venu Yeldandi) దర్శకత్వంలో హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం అందరి మన్ననలు పొందుతూ.. బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలతో పాటు.. కలెక్షన్స్‌ను అదే రేంజ్‌లో రాబట్టింది. వర్డ్ ఆఫ్ మౌత్ టాక్‌తో ఈ సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకుంటోంది..
ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో.. ఈ సినిమా తనదైన స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా.. ఇప్పటికే అంతర్జాతీయంగా అనేక అవార్డులను సొంతం చేసుకుంది.. చేసుకుంటోంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇలా పలు అవార్డులను అంతర్జాతీయంగా దక్కించుకుంటోంది బలగం సినిమా. తాజాగా ఈ లిస్టులో మరో రెండు అంతర్జాతీయ అవార్డులు వచ్చి చేరాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను దక్కించుకుంటోన్న ఈ చిత్రానికి స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 (Swedish International Film Festival 2023)లో రెండు అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడు (Best Actor) అవార్డు ప్రియదర్శి (సినిమాలో సాయిలు పాత్రధారి), ఉత్తమ సహాయ నటుడు (Best Supporting Actor) అవార్డును కేతిరి సుధాకర్ రెడ్డి (కొమురయ్య పాత్రధారి)కి వచ్చింది. ఇది నిజంగా గొప్ప ఎచీవ్‌మెంట్. ఎందుకంటే ఈ స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో.. 2021లో ఫహాద్ ఫాజిల్ ‘జోజి’కు ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. అలాగే గత ఏడాది మలయాళ చిత్రం ‘నాయట్టు’ సినిమాకు అవార్డ్ వచ్చింది. తర్వాత ఆ లిస్టులో ‘బలగం’ ఉండటం విశేషం.
ఓ కుటుంబంలోని పెద్ద మనిషి చనిపోతే అక్కడ ఉండే మనుషుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాల చుట్టూ అల్లిన కథాంశంతో ఈ సినిమాని వేణు తెరకెక్కించాడు. ప్రియదర్శి పులికొండ (Priyadarshi Pulikonda), కావ్యా కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram), మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, సుధాకర్ రెడ్డి (Kethiri Sudhakar Reddy) తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తెలంగాణ ప్రాంతాన్ని ఎలివేట్ చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవటమే కాదు. పలు అవార్డులను గెలుచుకుంటున్న ఈ చిత్రం.. ఇప్పడు టార్చ్ బేరర్‌గా మారింది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) సంగీతాన్ని అందించారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Bhookailas: ఎన్టీఆర్, ఏఎన్నార్‌లకు ఉదయం 5 గంటలకు షూటింగ్ అని చెప్పిన దర్శకుడు రాకపోవడంతో..?
*Farhana: ఇస్లాంకు వ్యతిరేకం కాదు.. కేరళ స్టోరీ కాంట్రవర్సీతో చిత్రయూనిట్ ముందు జాగ్రత్త చర్యలు
*The Kerala Story: కేరళ స్టోరీకి తమిళ నాడులో షాక్.. విషయం ఏమిటంటే?
*NTR: మరో సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా?
*Pic Talk: చందురుని మించు అందమొలికించు...
*Dimple Hayathi: కొంటె పనులు చాలా చేశాను
*Megastar VS Superstar: చిరంజీవికి పోటీగా రజనీకాంత్.. ఆగస్ట్‌లో అసలు మజా!