Mission- Chapter 1 Teaser: ఇది అరుణ్ విజయ్ ‘ఖైదీ’ అనుకోవచ్చు
ABN , First Publish Date - 2023-04-05T22:51:22+05:30 IST
ఆడియెన్స్‌కు ఎలాంటి సినిమాలు కావాలో.. సరైన సమయంలో వాటిని అందించడం ఈ నిర్మాణ సంస్థకున్న ప్రత్యేకత. ఇప్పుడలాంటి లిస్టులోకి చేరిన మరో భారీ బడ్జెట్ చిత్రం ‘మిషన్: చాప్టర్ 1’ (Mission: Chapter 1). ‘ఫియర్‌లెస్ జర్నీ’ అనేది
భారీ బడ్జెట్ చిత్రాలతో ఎప్పటికప్పుడు ప్రత్యేకతను చాటుకుంటున్న నిర్మాత సుభాస్కరన్ (Subaskaran). లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) సంస్థ ద్వారా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించటంతో పాటు వైవిధ్యమైన, ఎవరూ రూపొందించని, ప్రేక్షకులను కట్టిపడేసే కథాంశాలున్న సినిమాలకు డిస్ట్రిబ్యూషన్ పరంగానూ ఆయన అండగా నిలుస్తున్నారు. లైకా ప్రొడక్షన్ సినిమాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే.. అతిశయోక్తి కానే కాదు. ఎందుకంటే.. ఆడియెన్స్‌కు ఎలాంటి సినిమాలు కావాలో.. సరైన సమయంలో వాటిని అందించడం ఈ నిర్మాణ సంస్థకున్న ప్రత్యేకత. ఇప్పుడలాంటి లిస్టులోకి చేరిన మరో భారీ బడ్జెట్ చిత్రం ‘మిషన్: చాప్టర్ 1’ (Mission: Chapter 1). ‘ఫియర్‌లెస్ జర్నీ’ అనేది ట్యాగ్ లైన్. కోలీవుడ్ హీరో అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను విజయ్ దర్శకత్వంలో ఎం.రాజశేఖర్, ఎస్.స్వాతి నిర్మించారు. బుధవారం (ఏప్రిల్ 5న)రోజున ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. (Mission: Chapter 1 Teaser)
‘మిషన్: చాప్టర్ 1’ టీజర్‌ను గమనిస్తే ఇది మరో ‘ఖైదీ’ అన్నట్లుగా ఉంది. లండన్‌లో పేరు మోసిన జైలు వాండ్స్‌వర్త్ (Wandsworth) జైలు బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా నడుస్తుందని అర్థమవుతుంది. ప్రపంచంలోని ఖైదీలందరూ ఆ జైలులో ఉంటారు. ఆ జైలుకు సంరక్షించే ఆఫీసర్ పాత్రలో అమీ జాక్సన్ (Amy Jackson) నటిస్తుంది. ఇక ఆ జైలులో ఓ ఖైదీ పాత్రలో హీరో అరుణ్ విజయ్ నటించారు. కుటుంబంతో ఇండియా నుంచి లండన్ వచ్చిన అరుణ్ విజయ్‌ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారు. తన కుమార్తెకు మరో రెండు రోజుల్లో ఆపరేషన్ ఉంటుంది. తనేమో జైలులో ఉంటాడు. తన కూతురేమో తండ్రి కోసం ఎదురు చూస్తుంటుంది. అసలేం జరిగింది.. హీరో అరుణ్ విజయ్ ఏ కారణాలతో తను వాండ్స్‌వర్త్ జైలుకి వెళ్లాడు. చివరకు వాండ్స్ వర్త్ జైలు సూపరిడెంట్ ఆఫీసర్ అయిన అమీ జాక్సన్ ఏమైనా హెల్ప్ చేసిందా? అనే వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Mission: Chapter 1 Teaser Talk)
అద్భుతమైన సన్నివేశాలు, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో పాటు సెంటిమెంట్‌తో కూడిన డ్రామాతో వచ్చిన ఈ ‘మిషన్: చాప్టర్ 1’ టీజర్.. సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉంది. మరీ ముఖ్యంగా జి.వి.ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) బీజీఎం సినిమాకు మెయిన్ హైలెట్‌గా నిలుస్తుందనటంలో ఎటువంటి డౌటూ లేదు. డైరెక్టర్ విజయ్ తనదైన ప్లానింగ్‌తో ఇంత భారీ బడ్జెట్ చిత్రాన్ని 70 రోజుల్లోనే పూర్తి చేయడం ఈ సినిమాకున్న మరో విశేషం. అలాగే ఈ మూవీ కోసం లండన్ వాండ్స్‌వర్త్ జైలు చెన్నైలో పునః సృష్టించటం విశేషం. హీరో అరుణ్ విజయ్ రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో స్వయంగా ఆ సన్నివేశాల్లో నటించారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. ఆయన యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పించేలా ఉన్నాయి. టీజర్‌లో ఆ విషయం స్పష్టమైంది. అలాగే నైట్ షాట్స్, డ్రామా సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచుతోంది. ఓవరాల్‌గా ఈ టీజర్ చూసిన వారంతా.. మరో ‘ఖైదీ’ (Kaithi) రాబోతోంది అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. (Mission: Chapter 1 Teaser Out)
ఇవి కూడా చదవండి:
*********************************
*Upasana Baby Shower Party: వీడియోతో సర్‌ప్రైజ్ చేసిన ఉపాసన.. చరణ్ లుక్ అదుర్స్!
*Niharika: పచ్చి మామిడికాయ తింటూ నిహారిక పోస్ట్.. అంతా షాక్!
*Where is Pushpa?: ‘పుష్పరాజ్’ ఎక్కడ?.. సమాధానం తెలిసేది ఎప్పుడంటే?
*Jr NTR: అఫీషియల్.. మరో యుద్ధానికి సిద్ధం
*Rashmika Mandanna: నేషనల్ క్రష్ ఎలా అయిందో తెలుసా?