సైకో అరంగేట్రం

ABN , First Publish Date - 2023-04-27T00:04:53+05:30 IST

సైకో బేస్డ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘అరంగేట్రం’. రోషన్‌, ముస్తఫా అస్కరీ ప్రధాన పాత్రలు పోషించారు.

సైకో అరంగేట్రం

సైకో బేస్డ్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘అరంగేట్రం’. రోషన్‌, ముస్తఫా అస్కరీ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీనివాస్‌ ప్రభన్‌ కీలకపాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించారు. మహేశ్వరి కె. నిర్మించారు. మే 5న విడుదలవుతోన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ ప్రభన్‌ మాట్లాడుతూ ‘‘అరంగేట్రం’ పక్కా కమర్షియల్‌ మూవీ. ఇదొక సైకో కథ. కుటుంబ అనుబంధాలు, ప్రేమకథ అంతర్లీనంగా ఉంటాయి’ అని చెప్పారు. మహేశ్వరి మాట్లాడుతూ ‘పాటలు, ఫైట్స్‌, కామెడీ అన్నీ అద్భుతంగా కుదిరాయి. చిన్న సినిమా అయినా మేకింగ్‌లో రాజీ పడలేదు’ అన్నారు. ‘అరంగేట్రం’లో పాత్రలన్నీ కొత్తగా ఉంటాయని ముస్తఫా చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: గిడియన్‌ కట్టా. సినిమాటోగ్రఫీ: బురన్‌ షేక్‌

Updated Date - 2023-04-27T00:04:53+05:30 IST