మరో గ్యాంగ్ లీడర్
ABN , First Publish Date - 2023-06-25T00:43:07+05:30 IST
‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో వస్తున్న మరో చిత్రం ‘మోహన్‌కృష్ణ గ్యాంగ్ లీడర్’. మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మణ్ దర్శకత్వంలో...

‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో వస్తున్న మరో చిత్రం ‘మోహన్‌కృష్ణ గ్యాంగ్ లీడర్’. మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మణ్ దర్శకత్వంలో సింగలూరి మోహన్‌రావు నిర్మించారు. వచ్చే నెల 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటైన ప్రెస్‌మీట్‌లో నటుడు సుమన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో రైతు పాత్ర పోషించాను. రైతులు ఇబ్బందులు పడుతున్న ఓ బర్నింగ్ ఇష్యూ పై నా పాత్ర ఉంటుంది. చిరంజీవిగారు నటించిన ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను మెగా అభిమానులు ఆదరించాలి’ అని కోరారు. ఇందులో తను హీరోగా నటించినా అసలు హీరో సుమన్ అని మోహన్ కృష్ణ చెప్పారు. రైతు పాత్రను ప్రధానంగా తీసుకుని నిర్మించిన చిత్రం ఇదనీ, జై కిసాన్, జై జవాన్ అనే నినాదం ఎంత గొప్పదో ఈ సినిమాలో చూడొచ్చని దర్శకుడు శ్రీ లక్ష్మణ్ చెప్పారు.