Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!

ABN , First Publish Date - 2023-06-01T18:33:04+05:30 IST

అనసూయ ఓ కీలక పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విమానం’. ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో అనసూయ చెప్పిన డైలాగ్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అలాగే చిత్ర ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. సముద్రఖని ఇందులో అవిటిత‌నం గల వీరయ్య పాత్రలో నటించారు.

Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!
Anasuya in Vimanam Movie

‘ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకునే మగాళ్లనే చూశానురా.. మొదటిసారి మోకాళ్ల కింద పాదాల్ని పట్టుకుంటుంటే చాలా కష్టంగా ఉందిరా’ అంటూ అనసూయ (Anasuya) ఎమోషనల్‌గా చెబితే ఎలాంటి మగాడి హృదయమైనా కరిగిపోవాల్సిందే. అలాంటి ఎమోషన్‌తో ‘విమానం’ ట్రైలర్‌లో అనసూయ చెప్పిన ఈ డైలాగ్ గుండెలని పిండేస్తోంది. వీర‌య్య (Veerayya) అనే అంగవైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని (Samuthirakani), అతని కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ (Master Dhruvan).. సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ నటిస్తోన్న చిత్రం ‘విమానం’ (Vimanam). తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Vimanam-1.jpg

ట్రైలర్ విషయానికి వస్తే.. బస్తీలో ఉండే తండ్రీ కొడుకులు.. పూట గ‌డిస్తే చాల‌నుకునే చాలీ చాల‌ని సంపాద‌న‌.. అలాంటి ఓ పేద కుటుంబంలోని ఉండే పిల్లాడుకి విమానం ఎక్కాల‌నే కోరిక పుడుతుంది. తండ్రి అవిటిత‌నంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ కొడుకు కోరిక‌ను తీర్చాల‌నుకుని రాత్రి ప‌గ‌లు క‌ష్ట‌ప‌డుతుంటాడు. విమానం ఎక్కాల‌నుకునే కొడుకు కోరిక‌ను తీర్చటానికి ఏం చేయాలా? అని ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు. ఇది తండ్రీ కొడుకుల మ‌ధ్య ఉండే ఎమోష‌న్‌. మరోవైపు సుమ‌తీ అనే అమ్మాయిని ప్రేమించే కోటి.. లోక‌మంతా త‌న‌ను కామంతోనే చూస్తుంద‌ని భావించే ఆమెకు త‌నను మ‌న‌స్ఫూర్తిగా ప్రేమించే వాడున్నాడ‌ని తెలియ‌గానే ఆమె హృద‌యంలో నుంచి వచ్చే ఆవేద‌న‌.. ఇది రెండు హృద‌యాల మ‌ధ్య ఉండే ఎమోష‌న్‌. (Vimanam Movie Trailer Out)

Vimanam-2.jpg

హృద‌యాన్ని తాకే ఇలాంటి భావోద్వేగాల వ్య‌క్తుల ప్ర‌యాణాన్ని తెలియ‌జేసే చిత్ర‌ంగా ‘విమానం’ తెరకెక్కిందనేది ఈ ట్రైల‌ర్‌ను చూస్తుంటే తెలుస్తోంది. శివ ప్రసాద్ యానాల (Siva Prasad Yanala) దర్శకత్వంలో జీ స్టూడియోస్‌ (Zee Studios), కిర‌ణ్ కొర్ర‌పాటి (Kiran Korrapati) (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ఈ ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ విడుదల సందర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు శివ ప్ర‌సాద్ యానాల.. నిర్మాతలు జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి మాట్లాడుతూ ‘‘అనుపమ పరమేశ్వరన్‌గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతీ ఒక్క‌రి జీవితాల్లో బ‌ల‌మైన భావోద్వేగాలుంటాయి. అలాంటి ఎమోష‌న్స్‌ను బేస్ చేసుకునే ‘విమానం’ సినిమాను రూపొందించాం. జూన్ 9న ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుందని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*Mahesh Yuvasena: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ ఎంత గొప్పగా ఆలోచించారో చూశారా?

*Natti Kumar: అది కరెక్ట్ కాదు... ఏపీ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం

*Jurassic June: ‘జురాసిక్ పార్క్’‌కు 30 ఏళ్లు.. ఆ పేరు ఇక ఉండదు

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

*Agent: ఓటీటీలో.. అందుకే విడుదల కాలేదా?

Updated Date - 2023-06-01T18:33:04+05:30 IST