వినోదం పంచే పొట్టేల్
ABN , Publish Date - Dec 29 , 2023 | 12:33 AM
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్‌కు ‘పొట్టేల్’ అనే ఆసక్తికర టైటిల్ ఖరారైంది. గురువారం చిత్రబృందం ఫస్ట్ ఇంపాక్ట్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా...
యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్‌కు ‘పొట్టేల్’ అనే ఆసక్తికర టైటిల్ ఖరారైంది. గురువారం చిత్రబృందం ఫస్ట్ ఇంపాక్ట్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన నిర్మాత ప్రణయ్ వంగా మాట్లాడుతూ ‘పొట్టేల్ ఫస్ట్‌లుక్ వీడియో బాగుంది. ఓ మంచి కథను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యూనిట్ అంతా చాలా కష్టపడింది’ అని చెప్పారు. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్ కుమార్ సడిగే నిర్మించిన చిత్రమిది. బోనాల వేడుకలు, జోగిని రంగం ప్రదర్శించడం లాంటి ఘట్టాలతో విడుదల చేసిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా అనిపించింది. ఒక గొప్ప చిత్రం చేస్తున్నాననే ఫీలింగ్ కలిగింది అని అనన్య నాగళ్ల తెలిపారు. ‘పొట్టేల్’ కథ రాయడం మొదలైన రోజు నుంచి ఇప్పటిదాకా అదే ఉత్సాహంతో పనిచేశాను అని దర్శకుడు తెలిపారు. త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర. సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు.