Akhil Akkineni: ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్.. అయ్యగారు అరిపించేశారు

ABN , First Publish Date - 2023-04-07T15:20:27+05:30 IST

ఏప్రిల్ 8 అఖిల్ అక్కినేని పుట్టినరోజు (#HBDAkhilAkkineni) సందర్భంగా ‘ఏజెంట్’ మేకర్స్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో అఖిల్ అయ్యగారిని చూసిన ఫ్యాన్స్

Akhil Akkineni: ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్.. అయ్యగారు అరిపించేశారు
Akhil Akkineni in Agent Movie

యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni), స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి (Surender Reddy)ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ఏజెంట్’ (Agent). ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌‌కు సిద్ధమవుతోంది. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ జోరుగా మొదలయ్యాయి. ఏప్రిల్ 8 అఖిల్ అక్కినేని పుట్టినరోజు (#HBDAkhilAkkineni) సందర్భంగా ‘ఏజెంట్’ మేకర్స్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో అఖిల్ అయ్యగారిని చూసిన ఫ్యాన్స్.. ‘ఏమున్నాడురా బాబు’.. అనేలా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ పోస్టర్‌లో (Agent New Poster) అఖిల్ మిషన్ గన్ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు. పెద్ద యుద్ధం జరుగుతున్నట్లుగా ఆయన చుట్టూ ఉన్న లొకేషన్ చూస్తుంటే తెలుస్తుంది. ఓవరాల్‌గా మాత్రం ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఉంది. వాస్తవానికి ‘ఏజెంట్’ చిత్రం ఈపాటికే విడుదలై ఉండాలి. కానీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఎట్టకేలకు ఏప్రిల్ 28న థియేటర్లలోనికి రానుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి. ఇక రాబోయే ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాని ఓ రేంజ్‌లోకి తీసుకెళతాయని మేకర్స్ చెబుతున్నారు. (Akhil Akkineni Agent Specil Poster)

Akhil.jpg

సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్, పాత్రలో అఖిల్‌ని ప్రెజెంట్ చేస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) కీలక పాత్రలో కనిపించనున్నారు. అఖిల్ సరసన సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటించింది. AK ఎంటర్‌‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ (Vakkantham Vamsi) కథను అందించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో.. ఏకకాలంలో ఈ చిత్రం విడుదలకానుంది.


ఇవి కూడా చదవండి:

*********************************

*Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ మోసం చేశాడా?.. అసలా పోస్టర్‌లో ఉందెవరు?

*Rangamarthanda: ఓటీటీలోకి వచ్చేసిన ‘రంగమార్తాండ’.. ఏ ఓటీటీలో అంటే?

*Ravanasura Twitter Review: రవితేజ ‘రావణాసుర’ ట్విట్టర్ టాక్ ఏంటంటే..

*Rashmika Mandanna: త్వరలోనే గుడ్ న్యూస్.. రౌడీ హీరోతో ఒకే ఇంట్లో, ఒకే గదిలో..!?

*NBK SRH: పాపం మన SRH క్రికెటర్లు.. బాలయ్య డైలాగ్స్ చెప్పలేక ఎన్ని తిప్పలు పడ్డారో..!

Updated Date - 2023-04-07T15:20:30+05:30 IST