Dheera: యూత్‌ ఆడియన్స్‌కి కిక్కిస్తోన్న ప్రేమ పాట

ABN , First Publish Date - 2023-02-15T19:00:16+05:30 IST

కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.. అందులో ప్రేమ పాటల స్థానమే వేరు. అలాంటి పాటే ఇప్పుడు ‘ధీర’ (Dheera) చిత్రం నుంచి విడుదలైంది. యంగ్ హీరో

Dheera: యూత్‌ ఆడియన్స్‌కి కిక్కిస్తోన్న ప్రేమ పాట
Dheera Movie Still

కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.. అందులో ప్రేమ పాటల స్థానమే వేరు. అలాంటి పాటే ఇప్పుడు ‘ధీర’ (Dheera) చిత్రం నుంచి విడుదలైంది. యంగ్ హీరో లక్ష్ చదలవాడ (Laksh Chadalavada) హీరోగా నటించిన ఈ చిత్రంలోని ‘అదరం మధురం’ (Adharam Madhuram Song) అంటూ వాలెంటైన్స్ డే (Valentine's Day) స్పెషల్‌గా విడుదలైన ఈ పాట సంగీత ప్రియులని ఆకట్టుకుంటోంది. ప్రేయసి ఆలోచనలు, జ్ఞాపకాలతో ప్రియుడు తనలోని గాఢమైన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లుగా.. బాలాజీ (Balaji) ఈ పాటకు లిరిక్స్ అందించారు. అనురాగ్ కులకర్ణి, ML శృతి ఆలపించిన తీరు ఎంతో ఆకర్షిస్తోంది. హీరోహీరోయిన్లపై షూట్ చేసిన సన్నివేశాలు, రొమాంటిక్ మూమెంట్స్, హీరో లక్ష్ చదలవాడ డాన్స్ ఈ పాటకు మేజర్ అసెట్స్ అని చెప్పుకోవచ్చు. లిరిక్స్‌కి తగ్గట్టుగా సాయి కార్తీక్ (Sai Kartheek) కట్టిన బాణీలు ఈ సాంగ్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్లాయి. మొత్తంగా వాలెంటైన్స్ డే కి పర్ఫెక్ట్ సాంగ్ అనేలా ఈ పాట సాగింది.

హీరో లక్ష్ చదలవాడ విషయానికి వస్తే.. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును ఆయన సంపాదించుకున్నారు. రీసెంట్ ఆయన నటించిన ‘వలయం’, ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాలు మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు ‘ధీర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ యూత్ ఫుల్ యాక్షన్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు.

ఈ చిత్రం విక్రాంత్ శ్రీనివాస్ (Vikranth Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. చదలవాడ బ్రదర్స్ (Chadalavada Brothers) సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర (Sri Tirumala Tirupati Venkateswara) బ్యానర్‌పై పద్మావతి చదలవాడ (Padmavati Chadalavada) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉందని, త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాం అని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అన్ని అప్‌డేట్స్‌కు మంచి స్పందన వచ్చిందని.. సినిమా విజయంపై ఎంతో నమ్మకంగా ఉన్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు. (Adharam Madhuram Song In Dheera Movie)

Updated Date - 2023-02-15T19:00:28+05:30 IST