Panja Vaishnav Tej: కొడితే పదిమంది ఎగిరిపోయే తరహా ఫైట్లు ‘ఆదికేశవ’లో ఉండవ్..
ABN , First Publish Date - 2023-11-23T15:13:52+05:30 IST
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, టాలీవుడ్ క్రష్ శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకాబోతోంది.
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej), టాలీవుడ్ క్రష్ శ్రీలీల (Sreeleela) జంటగా శ్రీకాంత్ ఎన్ రెడ్డి (Srikanth N Reddy) దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. జోజు జార్జ్, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం సాయంత్రం ఈ మూవీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో పంజా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ప్రేక్షకులు ఓ మంచి సినిమా చూశామనే ఆనందంతో థియేటర్ల నుంచి బయటకు వస్తారు. పతాక సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ ఛాలెంజింగ్‌గా అనిపించింది. టీం అందరం కష్టపడి పనిచేశాం. యాక్షన్ సన్నివేశాలు కథలో భాగంగానే ఉంటాయి. వాటిని సాధ్యమైనంత మేర సహజంగానే చిత్రీకరించాం. ఫైట్స్ ఎక్కడా ఓవర్ ది బోర్డ్ ఉండవు. కొడితే పదిమంది ఎరిగిపోయే తరహా ఫైట్లు ఉండవు. నా వయసుకి తగ్గట్టుగానే ఫైట్లు ఉంటాయి. అవుట్ పుట్ మా అందరికీ చాలా బాగా నచ్చింది. సినిమా పట్ల టీం అంతా ఎంతో నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చుతుందని భావిస్తున్నామని అన్నారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) మాట్లాడుతూ.. ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నాం. విడుదలకు ముందురోజు సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నాం. మొదటి షో తిరుపతిలోని సంధ్య థియేటర్‌లో మొదలవుతుంది. ముందు రోజే షోలు వేయాలని నిర్ణయం తీసుకున్నామంటే ఈ సినిమా పట్ల మేము ఎంత నమ్మకంగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చని అన్నారు. దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి (Srikanth N Reddy) మాట్లాడుతూ.. కథ విని సినిమా చేయడానికి అంగీకరించిన వైష్ణవ్‌కి.. నాగవంశీ, చినబాబు(ఎస్. రాధాకృష్ణ), త్రివిక్రమ్‌గార్లకు ధన్యవాదాలు. ఓ కొత్త దర్శకుడిని నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. కొత్తవారికి ఇది అవకాశం ఇచ్చినట్లు కాదు.. జీవితం ఇచ్చినట్లు. జి.వి. ప్రకాష్ గారు అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించారు. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారు. సినిమా కోసం ప్రాణం పెట్టేశారు. నాకు కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఇది కామెడీ, ఎమోషన్, యాక్షన్ అన్నీ సరిగ్గా కుదిరిన కమర్షియల్ సినిమా అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
====================
*Payal Rajput: బోల్డ్ మూవీ అంటున్నారు కానీ.. సినిమా చూస్తేనే అందులో ఉందేంటో తెలుస్తుంది
*****************************
*Kaathal The Core: రెండు దేశాల్లో మమ్ముట్టి, జ్యోతికల చిత్రం బ్యాన్.. ఎందుకంటే?
*******************************