కళ్లు చెప్పే కథ
ABN , First Publish Date - 2023-06-16T01:56:05+05:30 IST
సాయిరోనక్, దేవిక సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ చిత్రం ‘కనులు తెరిచినా కనులు మూసినా’. సందీప్‌రెడ్డి కేటీ దర్శకత్వంలో...

సాయిరోనక్, దేవిక సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ చిత్రం ‘కనులు తెరిచినా కనులు మూసినా’. సందీప్‌రెడ్డి కేటీ దర్శకత్వంలో ఎస్. ఎన్ స్వామి నిర్మించారు. చిత్రబృందం గురువారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ప్రేమ, నమ్మకం, స్వార్థం, మోసం, కుట్ర లాంటి మనుషుల జీవితాల్లోని విభిన్న కోణాలను ఆవిష్కరించింది. గౌర హరి నేపథ్య సంగీతం ప్రత్యేకాకర్షణగా నిలిచింది. అర్జున్ ఆనంద్, ఉషాశ్రీ, సుచిత్ర ఆనందన్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ పర్వతనేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల