SALAAR : శత్రువులైన ఇద్దరు స్నేహితుల కథ!

ABN , First Publish Date - 2023-11-29T01:19:11+05:30 IST

ప్రభాస్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘సలార్‌’ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్‌ ఒకటిన విడుదల చేయనున్నారు....

SALAAR : శత్రువులైన ఇద్దరు స్నేహితుల కథ!

ప్రభాస్‌ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘సలార్‌’ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్‌ ఒకటిన విడుదల చేయనున్నారు. ‘కేజీఎఫ్‌ 2’ తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ రూపొందిస్తున్న ఈ భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో ఇంటెన్స్‌ సీన్లు ఎన్నో ఉన్నాయట. ‘కేజీఎఫ్‌’ చిత్రంతో ‘సలార్‌’ను పోల్చుకోవద్దనీ, ఈ సినిమా చాలా విభిన్నం అని ప్రశాంత్‌ నీల్‌ ఓ ఆంగ్ల వెబ్‌ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు మిత్రుల కథ ఇదనీ, ఇందులో ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ స్నేహితులుగా నటిస్తున్నారనీ ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ నీల్‌ వెల్లడించారు. కథలో సగ భాగం ఫస్ట్‌ పార్ట్‌లో ఉంటుందని, కథ డిమాండ్‌ మేరకు రెండో భాగాన్ని కూడా తీయాల్సి వచ్చిందనీ ఆయన తెలిపారు. సినిమాను రెండు భాగాలుగా తీయాలనే నిర్ణయం షూటింగ్‌ మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే తీసుకున్నట్లు ప్రశాంత్‌ తెలిపారు. డిసెంబర్‌ 22న ‘సలార్‌’ చిత్రం విడుదల కానుంది.

Updated Date - 2023-11-29T01:25:43+05:30 IST