కార్పొరేట్‌ కుర్రాడి కథ

ABN , First Publish Date - 2023-09-04T00:17:44+05:30 IST

బట్టల రామస్వామి బయోపిక్‌’ చిత్రంతో నిర్మాతగా గుర్తింపు పొందిన ‘సెవెన్‌ హిల్స్‌’ సతీశ్‌కుమార్‌ నిర్మిస్తున్న మూడో చిత్రం షూటింగ్‌ పూర్తయింది.

కార్పొరేట్‌ కుర్రాడి కథ

‘బట్టల రామస్వామి బయోపిక్‌’ చిత్రంతో నిర్మాతగా గుర్తింపు పొందిన ‘సెవెన్‌ హిల్స్‌’ సతీశ్‌కుమార్‌ నిర్మిస్తున్న మూడో చిత్రం షూటింగ్‌ పూర్తయింది. గౌతమ్‌కృష్ణ, శ్వేత అవాస్తి ఇందులో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పి.నవీన్‌కుమార్‌ దర్శకుడు. త్వరలో ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘స్టూడెంట్‌ స్థాయి నుంచి కార్పొరేట్‌ రేంజ్‌కి ఎదిగిన ఓ మధ్యతరగతి యువకుడి కథ ఇది. యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే అంశాలు ఉన్నాయి. ‘ఆకాశ వీధుల్లో చిత్రంతో మంచి గుర్తింపు పొందిన గౌతమ్‌ కృష్ణ ఈ సినిమాలో స్టూడెంట్‌ పాత్రకు న్యాయం చేశాడు’ అని తెలిపారు. ‘మూడు షెడ్యూల్స్‌ విజయవంతంగా పూర్తి చేశాం. త్వరలో టైటిల్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తాం. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి, రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’ అని చెప్పారు నిర్మాత సతీశ్‌కుమార్‌.

Updated Date - 2023-09-04T00:17:48+05:30 IST