తల్లితండ్రులతో చూడాల్సిన సినిమా
ABN , First Publish Date - 2023-03-20T02:04:22+05:30 IST
‘‘ప్రతి ఒక్కరూ తమ తల్లితండ్రులతో కలసి చూడాల్సిన చిత్రం ‘రంగమార్తాండ’’ అని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన పాత్రలు...

‘‘ప్రతి ఒక్కరూ తమ తల్లితండ్రులతో కలసి చూడాల్సిన చిత్రం ‘రంగమార్తాండ’’ అని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ ‘ఈ చిత్రానికి నటీనటులు, ఇళయరాజా సంగీతం, సీతారామశాస్త్రి సాహిత్యం అన్నీ బాగా కుదిరాయి. రమ్యకృష్ణ కళ్లతోనే భావాలు పలికించారు. ఆమె పాత్ర శక్తిమంతంగా ఉంటుంది. ప్రివ్యూషో చూసినవాళ్లందరూ మంచి సినిమా తీశారని మెచ్చుకుంటున్నారు’ అని చెప్పారు. నటుడిగా తనకు ఈ చిత్రంతో మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందన్నారు రాహుల్ సిప్లిగంజ్.