సూపర్‌ విలన్‌తో సామాన్యుడి పోరాటం

ABN , First Publish Date - 2023-12-18T01:28:54+05:30 IST

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా ిసీవీ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మాయవన్‌’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రాజెక్ట్‌ జడ్‌’కు ఇది సీక్వెల్‌...

సూపర్‌ విలన్‌తో సామాన్యుడి పోరాటం

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా ిసీవీ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మాయవన్‌’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ప్రాజెక్ట్‌ జడ్‌’కు ఇది సీక్వెల్‌. ఏకే ఎంటర్టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందుతోంది. తాజాగా చిత్రబృందం ఓ స్పెషల్‌ అప్‌డేట్‌ను పంచుకొంది. బాలీవుడ్‌ నటుడు, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ ‘మాయవన్‌’లో కీలకపాత్రలో నటిస్తున్నారని మేకర్స్‌ తెలిపారు. యాక్షన్‌ ప్యాక్డ్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఈ రోల్‌ కోసం ఆయన ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌కు జోడీగా ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ కనిపించనున్నారు. సూపర్‌ విలన్‌తో సామాన్యుడి ఘర్షణ నేపథ్యంలో కథ ఉంటుందని యూనిట్‌ తెలిపింది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2023-12-18T01:28:55+05:30 IST