14 Days Love: ‘14 డేస్ లవ్’ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?

ABN , Publish Date - Dec 29 , 2023 | 06:10 PM

సుప్రియ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ పతాకంపై అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో.. నాగరాజు బోడెం దర్శకత్వంలో నిర్మాత హరిబాబు దాసరి నిర్మించిన యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘14 డేస్ లవ్’. సంప్రదాయ విలువలకు పెద్ద పీట వేస్తూ రూపొందిన ఈ చిత్రాన్ని నూతన సంవత్సరంలో జనవరి 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.

14 Days Love: ‘14 డేస్ లవ్’ రెడీ.. రిలీజ్ ఎప్పుడంటే?
14 Days Love Still

సుప్రియ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ (Supriya Entertainments) పతాకంపై అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో.. నాగరాజు బోడెం (Nagaraju Bodem) దర్శకత్వంలో నిర్మాత హరిబాబు దాసరి (Haribabu Dasari) నిర్మించిన యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘14 డేస్ లవ్’ (14 Days Love). మనోజ్ పుట్టూర్, చాందిని భాగవని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో రాజా రవీంద్ర, సనా సునూర్ కీలక పాత్రలు పోషించారు. అంజలి, ఐడ్రీమ్ రాజా, శ్రీధర్ తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. (14 Days Love Release Date)


14-Days-Love-Still.jpg

ఈ సినిమా నూతన సంవత్సరంలో జనవరి 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ.. కుటుంబ విలువల్ని కాపాడే ప్రయత్నంలో ఓ ఇంటి వారసులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? వారి మధ్య చిగురించిన ప్రేమకు ఎలాంటి ముగింపు దొరికింది అనే కోణంలో ఈ సినిమా ఉంటుంది. సంప్రదాయ విలువలకు పెద్ద పీట వేస్తూ రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని తెలిపారు. జనవరి 5న అందరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాలని ఆయన కోరారు.


ఇవి కూడా చదవండి:

====================

*Vijayakanth: రియల్ హీరో విజయకాంత్ గురించి ఈ విషయాలు తెలుసా? కెప్టెన్‌ స్మృతిలో రాష్ట్రం

***************************

*Hansika: హన్సిక 105 నిమిషాలతో రెడీ అవుతోంది.. ఈసారి ఏం చేస్తుందో?

*************************

*Alphonse Puthren: విజయకాంత్‌‌‌ని హత్య చేశారు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

**************************

*Chiranjeevi: ‘నేను’గా.. మనందరి బ్రహ్మానందం!

****************************

Updated Date - Dec 29 , 2023 | 06:10 PM