Nandita Das: అవార్డ్స్ రానంత మాత్రాన టాలెంట్‌ను తక్కువ చేయలేం

ABN , First Publish Date - 2023-03-23T20:46:37+05:30 IST

రంగస్థల నటిగా కెరీర్‌ను ఆరంభించి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నందితా దాస్ (Nandita Das). దాదాపుగా 10 భాషల్లో 40కి పైగా సినిమాలు చేసింది. నందిత తాజాగా తెరకెక్కించిన సినిమా ‘జ్విగటో’ (Zwigato).

Nandita Das: అవార్డ్స్ రానంత మాత్రాన టాలెంట్‌ను తక్కువ చేయలేం

రంగస్థల నటిగా కెరీర్‌ను ఆరంభించి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ నందితా దాస్ (Nandita Das). దాదాపుగా 10 భాషల్లో 40కి పైగా సినిమాలు చేసింది. నందిత తాజాగా తెరకెక్కించిన సినిమా ‘జ్విగటో’ (Zwigato). బాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma) హీరోగా నటించారు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు విచ్చేశారు. సినిమాకు సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.

‘‘మనసున్న కదిలించే అంశాలతో జ్విగటో సినిమా రూపొందింది. కపిల్ శర్మను ఎప్పుడు చూడని విధంగా చూస్తారు. నేను జ్విగటోను తెరకెక్కించినప్పటికి ఆన్‌లైన్‌లో ఎక్కువను ఫుడ్‌ను ఆర్డర్ చేయను. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశాను. ఫుడ్ డెలివరీ చేసే వారితో చాలా సార్లు మాట్లాడాను. మీ మీద ఒక సినిమా వస్తుందని మీకు తెలుసా..? అని అడగగా ‘జ్విగటో’ అని కొంత మంది చెప్పారు. కొంత మంది డెలివరీ బాయ్స్ ఈ సినిమా ట్రైలర్‌.. మా జీవితం మాదిరిగానే ఉందన్నారు. కొంత మంది కనెక్ట్ అయ్యారు. ఆస్కార్స్ గెలుపొందిన వారికి నా హృదయ పూర్వక అభినందనలు. ఆస్కార్స్ చాలా పెద్ద అవార్డ్స్. ఈ పురస్కారాలు గెలుపొందినందుకు మనం సంబరాలు చేసుకోవాలి. కాలం గడిచేకొద్ది మన పనిని మాత్రమే గుర్తుంచుకుంటారు. గొప్ప ఫిల్మ్ మేకర్స్‌కు కొన్ని సార్లు అవార్డ్స్ రాలేదు. అంత మాత్రాన వారు తక్కువేమీ కాదు. వారి టాలెంట్‌ను ఏ మాత్రం తక్కువ చేయలేం. ఓ సారి ప్లైట్‌లో రాజమౌళిని కలుసుకున్నాను. ఆ సందర్భంగా ఆయనతో మాట్లాడాను. టోరెంటో ఫిలిం ఫెస్టివల్‌లోను ఒకరికి మరొకరం ఎదురు పడ్డాం. ఆయన వ్యక్తిత్వానికి తీసే సినిమాలకు మధ్య వైవిధ్యం ఉంటుంది. నేను కొన్ని తెలుగు సినిమాలు చేశాను. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించాలంటే భాష రావాలి. అందువల్ల ధైర్యం చేయడం లేదు’’ అని నందితా దాస్ పేర్కొన్నారు.

^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Pawan Kalyan: నా రెమ్యునరేషన్ రోజుకు రెండు కోట్లు

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-23T20:46:39+05:30 IST