Ranveer Singh: మూడు ఫ్లాప్స్ తరువాత యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ నటుడికి షాక్ ఇచ్చింది, ఎలా అంటే ?
ABN , First Publish Date - 2023-04-15T17:56:45+05:30 IST
యష్ రాజ్ ఫిలిమ్స్ బాలీవుడ్ లో చాలా పెద్ద పేరున సంస్థ. అటువంటి సంస్థ ఇప్పుడు భారీ ప్రోజెక్టుల మీద కన్నేసింది. మల్టీ స్టారర్, స్పై సినిమాలతో బిజీ గా వున్న ఈ సంస్థ ఒక నాయుడుకి షాక్ ఇవ్వబోతోంది. ఇంతకీ అతను ఎవరంటే...
బాలీవుడ్ సినిమా పరిశ్రమలో త్వరగా స్టార్ డమ్ ని అందుకున్న నటుల్లో రణవీర్ సింగ్ (Ranveer Singh) ఒకడు. 'బ్యాండ్ బాజా భరాత్' (Band Baaja Baaraat) సినిమాతో 2010 లో ప్రారంభం అయిన రణవీర్ కెరీర్ ఆనతికాలం లోనే 'బాజీరావు మస్తానీ' (Bajirao Mastani), 'పద్మావతి' (Padmavat), 'శింబ' (Simba), 'గల్లీ బాయ్' (Gully Boy) సినిమాలు చేసి సూపర్ స్టార్ అయ్యాడు. అయితే ఇవన్నీ కోవిడ్ ముందు వచ్చిన సినిమాలు అవటం విశేషం.
కోవిడ్ తరువాత రణవీర్ సింగ్ సినిమాలు కొన్ని విడుదల అయ్యాయి, కానీ అవేమీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిలబడలేకపోయాయి. ఈమధ్య వచ్చిన 'సర్కస్' (Cirkus), ఈ సినిమాకి ముందు 'జయేష్ భాయ్ జోర్దార్' (Jayeshbhai Jordaar), ఈ రెండిటికి ముందు '83' (83) ఇలా వరస ఫ్లోప్స్ తో రణవీర్ వెంకపడిపోయాడు. రణవీర్ సింగ్ ఎక్కువగా యాష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ (YashRajFilms) తో సినిమాలు చేసాడు. వాళ్ళతో ఆరు సినిమాలు చెయ్యగా, ఒక్క 'బ్యాండ్ బాజా భరాత్' (Band Baaja Baaraat) మాత్రమే కొంచెం ఆడింది. (#AdityaChopra) అలాగే ఇంకో రెండు సినిమాలు యావరేజ్ సినిమాలు కాగా, మూడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందుకని యాష్ రాజ్ ఫిలిమ్స్ (#YRF) ఇక రణవీర్ సింగ్ తో సినిమాలు తీయటం ఆపేయాలని అనుకుంటున్నారని బాలీవుడ్ పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉంటే, యాష్ రాజ్ ఫిలిమ్స్ ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల మీద కన్నేసింది అని కూడా తెలుస్తోంది. షారుఖ్ ఖాన్ (ShahRukhKhan) తో ఈమధ్య విడుదల అయిన 'పఠాన్' (Pathaan) ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. అలాగే 'వార్ 2' (War 2), సల్మాన్ ఖాన్ తో (Salman Khan) 'టైగర్ 3' (Tiger 3), 'ధూమ్' లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేతులో వున్నాయి. ఈ సమయం లో మళ్ళీ రణవీర్ సింగ్ తో సినిమా తీసి ఎందుకు ప్లాప్ అనిపించుకోవడం అని ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది.
మిగతా నటుల్ని కూడా చూస్తే, రణబీర్ కపూర్ (Ranbir Kapoor) 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) తో పెద్ద హిట్ కొట్టాడు, అలాగే అజయ్ దేవగన్ (Ajay Devgn) 'దృశ్యం' (Drishyam 2) తో హిట్, అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్లాప్ లు ఇచ్చిన 'సూర్యవంశీ' తో నిలబడ్డాడు. ఆఖరికి షా రుఖ్ ఖాన్ కూడా 'పఠాన్' సినిమాతో మళ్ళీ దూసుకుపోతున్నాడు. కానీ రణవీర్ సింగ్ మాత్రం చాలా వెనుకబడిపోయాడు. మళ్ళీ రణవీర్ కి ఒక సంజయ్ లీల భన్సాలీ (Sanjay Leela Bhansali) లాంటి దర్శకుడు రావాలేమో. ఎందుకంటే అతనితో రణవీర్ సింగ్ మూడు సినిమాలు చేసాడు, అన్నీ సూపర్ హిట్స్. 'రామ్ లీల' (Goliyon Ki Raasleela Ram-leela), 'బాజీరావు మస్తానీ' (Bajirao Mastani), ఇంకా మూడోది 'పద్మావతి' (Padmaavat).