Vivek Agnihotri: ప్రకాష్ రాజ్‌ను అంధకార్ రాజ్ అంటూ విమర్శలు
ABN , First Publish Date - 2023-02-11T19:44:02+05:30 IST
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashhmir Files). లో బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీపై నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) తీవ్రమైన విమర్శలు చేశారు.
బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashhmir Files). లో బడ్జెట్‌లో రూపొందిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ మూవీపై నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) తీవ్రమైన విమర్శలు చేశారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ ను చెత్త చిత్రంగా అభివర్ణించారు. ఇంటర్నేషనల్ జ్యూరీ కూడా ఆ సినిమాపై ఉమ్మేసిందన్నారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) వంటి వారు దేశ ప్రజలను ప్రతిసారి పిచ్చోళ్లను చేయలేరని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలోనే ‘పఠాన్’ (Pathaan) చిత్రానికి తన సంపూర్ణ మద్దతును ప్రకాష్ రాజ్ తెలియజేశారు. ఈ సినిమాపై నిషేధం విధించాలన్న వారిని ఇడియట్‌గా అభివర్ణించారు. కొన్ని రోజుల క్రితమే గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (IFFI) జ్యూరీ హెడ్ నదవ్ లపిడ్ (Nadav Lapid) ‘కశ్మీర్ ఫైల్స్’ ను ఇదో వల్గర్ సినిమా అని చెప్పారు.
ప్రకాష్ రాజ్ చేసిన విమర్శలకు వివేక్ అగ్నిహోత్రి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఒక్క చిన్న, ప్రజల సినిమా అర్బన్ నక్సల్స్‌కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. మూవీ రిలీజ్ అయ్యి ఏడాది అయినప్పటికీ దీనిని మరిచిపోలేకపోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రేమించిన వారిని మొరిగే కుక్కలు అంటున్నారు. అంధకార్ రాజ్‌కే ఎల్లప్పుడు భాస్కర్ అవార్డు వస్తుంటే మాకు ఎక్కడ అవకాశం ఉంటుంది’’ అని వివేక్ అగ్నిహోత్రి పేర్కొన్నారు.
కశ్మీరీ పండిట్స్‌పై 1990లో జరిగిన హత్యకాండను ఆధారంగా చేసుకుని ‘ది కశ్మీర్ ఫైల్స్’ ను రూపొందించారు. ఈ సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి, జీ స్టూడియోస్ కలసి ఐ యామ్ బుద్ధ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై నిర్మించాయి. ‘ది కశ్మీర్ ఫైల్స్’ గతేడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.