UrvashiRautela: ఈ అమ్మడు అక్కడ ఇరుక్కుపోయింది, పాపం

ABN , First Publish Date - 2023-07-03T17:19:42+05:30 IST

వాల్తేరు వీరయ్య లో మెగా సార్ చిరంజీవి తో అదిరేటి స్టెప్పులేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా పారిస్ వెళ్ళింది. అక్కడ అనుకున్న పని జరగకపోగా ఎటూ పోలేక ఇరుక్కుపోయింది

UrvashiRautela: ఈ అమ్మడు అక్కడ ఇరుక్కుపోయింది, పాపం

ఫ్రాన్స్ (France) దేశం రాజధాని నగరం పారిస్ (Paris) ఫాషన్ కి పెట్టింది పేరు. అక్కడికి ప్రపంచంలో గొప్ప గొప్ప డిజైనర్లు వస్తూ వుంటారు, ఫాషన్ షో లు కూడా ఏర్పాటు చేస్తూ వుంటారు. అయితే గత కొన్ని రోజుల నుండి పారిస్ నగరం అల్లర్లతో, నిరసనలతో చాలా అల్లకల్లోలంగా వుంది. పారిస్ లో జరగాల్సిన చాలా ఈవెంట్స్ రద్దు అవటంతో, ఎక్కడి వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారు. అందులో బాలీవుడ్ నటి, 'వాల్తేరు వీరయ్య'లో (WaltairVeerayya) చిరంజీవితో (MegaStarChiranjeevi) 'బాస్ పార్టీ' (BossParty) పాటలో చిందులేసిన ఊర్వశి రౌటేలా (UrvashiRautela) కూడా ఇరుక్కుపోయింది.

urvashi-paris.jpg

ఊర్వశి పారిస్ ఫాషన్ వీక్ లో పాల్గొనటానికి వెళ్ళింది. ఆమె షో స్టాపర్ గా అక్కడ ఫాషన్ డిజైన్ లో పాల్గొనవలసిందిగా పారిస్ నుండి ఆహ్వానం వచ్చింది. వెంటనే ఊర్వశి ముంబై నుండి పారిస్ వెళ్లి, అక్కడ ఫాషన్ వీక్ లో పాల్గొనాలని అనుకుంది, కానీ పాపం పారిస్ అంతా ఇలా అల్లకల్లోలంగా తయారవటంతో ఊర్వశి అక్కడ ఇరుక్కిపోయింది. ప్రపంచ నలుమూలల నుండి పారిస్ కి వచ్చి తమ రకరకాలైన ఫాషన్ లను చూపిస్తూ వుంటారు. అందులో కొందరు టాప్ మోడల్స్ కూడా పాల్గొంటారు.

ఈ మోడల్స్ కూడా ప్రపంచ నలుమూలల నుండి పేరున్న చాలామంది వచ్చి ఒక్కో డిజైనర్ కూ ఒక్కో నటి, లేదా మోడల్ ఇలా ఆ డిజైనర్ దుస్తులు ధరించి ప్రదర్శనలో పాల్గొంటారు. ఇది చాలా గొప్పగా జరుగుతూ ఉంటుంది పారిస్ లో. ఆలా చాలామంది మోడల్స్, నటీమణులు పాల్గొంటున్న ఈ ఫ్యాషన్ వీక్ లో పాల్గొనటానికి ఊర్వశి రౌటేలా కూడా వచ్చింది.

urvashirautela1.jpg

ఇలా పారిస్ నగరం నిరసనలు మధ్య హోరెత్తిపోతుంటే రవాణా సౌకర్యం కూడా ఆపేశారని తెలిసింది. ఇటువంటి సమయంలో ఊర్వశి రౌటేలా ఫాషన్ వీక్ లో పాల్గొనటం అసంభవం అని అందుకు ఎంతో చింతిస్తున్నాను అని చెప్తోంది సాంఘీక మాధ్యమం ద్వారా.

Updated Date - 2023-07-03T17:19:42+05:30 IST