Adipurush: మరోసారి ప్రభాస్ మూవీ పోస్టర్‌పై ట్రోలింగ్.. ఈసారి హనుమంతుడి గెటప్‌పై..

ABN , First Publish Date - 2023-03-31T12:29:02+05:30 IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Adipurush: మరోసారి ప్రభాస్ మూవీ పోస్టర్‌పై ట్రోలింగ్.. ఈసారి హనుమంతుడి గెటప్‌పై..
Adipurush

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకు తగ్గట్లుగానే ప్రభాస్ సైతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కే క్రేజీ సినిమాలను కమిట్ అయ్యాడు. అందులో.. బాలీవుడ్ యువ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) దర్శకత్వంలో చేస్తున్న ‘ఆదిపురుష్’ (Adipurush) ఒకటి. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఎనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే టీ - సిరీస్ (T-Series) బ్యానర్‌పై భూషణ్ కుమార్ (Bhushan Kumar) భారీగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జూన్ 16న విడుదల చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తోంది.

అయితే.. ‘ఆదిపురుష్’ని ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని మూవీ టీం మొదట ప్లాన్ చేసింది. అందులో భాగంగా.. ఫస్ట్ లుక్స్‌తో పాటు టీజర్‌ని సైతం విడుదల చేశారు. కాని.. ఆ టీజర్‌పై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. అది యానిమేటేడ్ సినిమాల ఉందంటూ సినీ లవర్స్ విమర్శలు చేశారు. దీంతో వెనక్కి తగ్గిన చిత్రబృందం విడుదల తేదిని జూన్‌కి మార్చి.. దిద్దుబాటు చర్యలకు దిగింది.

Adipurush1.jpg

విడుదల తేది దగ్గర పడుతున్న ఈ తరుణంలో శ్రీరామనవమి సందర్భంగా ఆ చిత్రం నుంచి మరో పోస్టర్.. ఈ చిత్ర దర్శకుడు ‘ఓం రౌత్’ విడుదల చేశాడు. అయితే.. అది కూడా బాలేకపోవడంతో ఏ మాత్రం ఇంప్రూవ్‌మెంట్ లేదని, అనుకున్నంత క్వాలిటీ లేదని కామెంట్లు చేశారు. ఇంతలోనే అదే పోస్టర్‌లోని హనుమంతుడి గెటప్‌పై విమర్శలు చేస్తున్నారు.

ఆ పోస్టర్‌లో హనుమంతుడికి గడ్డం ఉంది.. కాని మీసాలు లేవు.. ఇదే నెటిజన్ల కోపానికి కారణమైంది. ‘ఆదిపురుష్ మూవీలో హనుమంతుడికి గడ్డం పెట్టారు. మీసాలు మాత్రం లేవు. ఇందులో ఆయన ముస్లింలాగా కనిపిస్తున్నాడు. అలాగే, రాముడు, లక్ష్మణుడికి మీసాలు పెట్టారు. ఇలా ఏ శాస్త్రంలోనైనా చూశామా.. అంతేకాకుండా.. సీతని రావణుడు కిడ్నాప్ చేయడాన్ని కూడా న్యాయబద్ధంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. అలాగే మరికొందరు సైతం సినిమాని ఇలాగే తీస్తారా అంటూ చిత్ర నిర్మాతని సైతం విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే.. మరికొందరేమో ‘హనుమంతుడికి మీసాలు లేకుండా చాలా ఈమేజేస్ ఉన్నాయి. కానీ గడ్డ మాత్రం ముస్లింలాగే ఉంది’ అని రాసుకొస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో సీతగా కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

Taapsee Pannu: తాప్సీపై కేసు.. ఆ సమయంలో లక్ష్మీదేవి లాకెట్ ధరించడంతో..

Adipurush: రిలాక్స్ ప్రభాస్ ఫ్యాన్స్.. వాటిని నమ్మొద్దు.. దానికే ఫిక్సయిపోండి..

Shah Rukh Khan Vs Virat Kohli: సోషల్ మీడియాలో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్.. కారణం ఏంటంటే..

Akanksha Dubey: యువ నటి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. అతను మోసం చేయడం వల్లేనంటూ..

Global Icon Allu Arjun: స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్‌ స్టార్‌గా.. 20 ఏళ్లలో ఎన్ని మార్పులు..

Updated Date - 2023-03-31T12:53:59+05:30 IST