Gadar 2: ఎద్దుల బండి చక్రం ఎత్తి పోరాటం!

ABN , First Publish Date - 2023-01-04T17:31:46+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ్’ (Gadar: Ek Prem Katha). సన్నీ డియోల్ (Sunny Deol), అమిషా పటేల్ (Ameesha Patel) హీరో, హీరోయిన్స్‌గా నటించారు. సన్నీ ఈ చిత్రంలో తారాసింగ్ పాత్రలో కనిపించాడు.

Gadar 2: ఎద్దుల బండి చక్రం ఎత్తి పోరాటం!

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ్’ (Gadar: Ek Prem Katha). సన్నీ డియోల్ (Sunny Deol), అమిషా పటేల్ (Ameesha Patel) హీరో, హీరోయిన్స్‌గా నటించారు. సన్నీ ఈ చిత్రంలో తారాసింగ్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమా 2001లో విడుదలైంది. భారీ స్థాయి వసూళ్లను రాబట్టింది. దాదాపు రెండు దశాబ్దాల అనంతరం ఈ మూవీకి రెండో భాగం రూపొందుతుంది. ‘గదర్ 2’ (Gadar 2) టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఈ మూవీ గ్లింఫ్స్ ఈ మధ్యే విడుదలైంది. ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.

జీ స్టూడియోస్ 2023లో తమ ప్రాజెక్టుల లైనప్‌ను ప్రకటించింది. 50సెకండ్ల వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియోలో.. అజయ్ దేవగణ్ ‘మైదాన్’, సోనూ సూద్ ‘ఫత్తే’, నవాజుద్దిన్ సిద్దిఖీ ‘హడ్డి’ కనిపించాయి. వీడియో చివరకు వచ్చే సమయానికి ‘గదర్ 2’ దర్శనమిచ్చింది. ఎద్దుల బండి చక్రం ఎత్తి తారాసింగ్ రౌడీలతో పోరాడుతున్నాడు. ఈ సినిమాలో సన్నీ డియోల్, అమిషా పటేల్ భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ‘గదర్’ కు ఫ్రీక్వెల్‌గా ఈ ప్రాజెక్టు రూపొందుతుంది. ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోను భారీ బజ్ ఉంది. తారాసింగ్ కుటుంబం చుట్టూ జరిగే కథను ‘గదర్ 2’ లో చూపించనున్నారు. ఈ చిత్రానికి అనిల్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Updated Date - 2023-01-04T17:33:53+05:30 IST