Sunny Deol : సన్నీ గ్రాండ్‌ పార్టీ.. 16 ఏళ్ల తర్వాత కలిశారు!

ABN , First Publish Date - 2023-09-03T12:58:48+05:30 IST

బాలీవుడ్‌ నటుడు సన్నీ దేఓల్‌ బీటౌన్‌ సెలబ్రిటీలకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. సీనియర్‌ స్టార్లు, యువ నటీనటులతో ‘గద్దర్‌2’ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. వీకెండ్‌ను ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

Sunny Deol : సన్నీ గ్రాండ్‌ పార్టీ.. 16 ఏళ్ల తర్వాత కలిశారు!

బాలీవుడ్‌ నటుడు సన్నీ దేఓల్‌ బీటౌన్‌ సెలబ్రిటీలకు గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. సీనియర్‌ స్టార్లు, యువ నటీనటులతో ‘గద్దర్‌2’ సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. వీకెండ్‌ను ఎంజాయ్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. సన్నీ దేఓల్‌ కీలక పాత్ర పోషించగా అనిల్‌ శర్మ దర్శకత్వం వహించిన ‘గద్దర్‌2 ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసింది. ఇప్పటికీ ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతోంది. రూ.500 కోట్లు వసూళ్లకు దగ్గరగా ఉంది. చాలాకాలం తర్వాత సన్నీకి దక్కిని విజయమిది. ఈ సందర్భంగా చిత్ర బృందం బాలీవుడ్‌ సెలబ్రిటీలను అందరినీ పిలిచి సక్సెస్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ మేరకు బీటౌన్‌ స్టార్స్‌ కోసం శనివారం రాత్రి ముంబయిలో గ్రాండ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, కాజోల్‌, కార్తిక్‌ ఆర్యన్‌, కృతిసనన్‌, జాకీష్రాఫ్‌, గౌరీ ఖాన్‌, సారా అలీఖాన్‌ తదిలరులు ఈ వేడుకలో సందడి చేశారు. సన్నీ సాధించిన విజయం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. దాదాపు 16 ఏళ్ల తర్వాత షారుఖ్‌ - సన్నీదేఓల్‌ కలిసి ఒకే వేదికపై కనిపించడం విశేషం. ‘డర్‌’ సినిమా తర్వాత వీరి మధ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆనాటి నుంచి వీరిద్దరూ కలిసి కనిపించలేదు...మాటలు లేవని బీటౌన్‌ టాక్‌. ఈ సందర్భంగా వీరిద్దరూ కలవడంతో బాలీవుడ్‌ హర్షం వ్యక్తం చేస్తోంది. ఒకే వేదికపై సన్నీ దేఓల్‌, షారుక్‌ ఖాన్‌ కనిపించడం, ఆలింగనం చేసుకోవడంతో ఇద్దరి మధ్య వివాదం సమసిపోయిందని బీటౌన్‌ మీడియా చెబుతోంది.

Updated Date - 2023-09-03T13:17:46+05:30 IST