Sulochana Latkar Death: సీనియర్ నటి సులోచన లట్కర్ కన్నుమూత!
ABN , First Publish Date - 2023-06-05T14:07:45+05:30 IST
సినీ ఇండస్ర్టీలో విషాదం నెలకొంది. సీనియర్ నటి సులోచన లట్కర్ (94) మృతి చెందారు(Sulochana Latkar Death). అనారోగ్య కారణాలతో ముంబయి దాదర్‌లోని సుశ్రుసా ఆసుపత్రిలో చేరిన ఆమె ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
సినీ ఇండస్ర్టీలో విషాదం నెలకొంది. సీనియర్ నటి సులోచన లట్కర్ (94) మృతి చెందారు(Sulochana Latkar Death). అనారోగ్య కారణాలతో ముంబయి దాదర్‌లోని సుశ్రుసా ఆసుపత్రిలో చేరిన ఆమె ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1928 జూలై 30న కర్ణాటకలోని ఖడక్లాత్‌లో జన్మించిన సులోచన లట్కర్ 1946లో సినీరంగంలోకి అడుగుపెట్టారు. 1959లో ‘దిల్ దేకే దేఖో’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో కూడా అరంగేట్రం చేశారు. 1995 వరకు అనేక సినిమాల్లో నటించారు. ‘గోరా ఔర్ కాలా’, ‘సంపూర్ణ రామాయణం’ ‘జీవచా శాఖ’ వంటి చిత్రాల్లో నటనకు పేరు సంపాదించారు. సులోచన ఎక్కువగా హిందీ, మరాఠీ చిత్రాల్లో నటించారు. దాదాపు 250కి పైగా మరాఠీ చిత్రాల్లో కనిపించారు.
1960-70ల సమయంలో ఆమె పాపురల్ సినిమల్లో నటించారు. అలాగే స్టార్ హీరోహీరోయిన్‌లకు తల్లి పాత్రలో ఎక్కువ మెప్పించి నటిగా తనదైన ముద్రవేశారు. సినీ పరిశ్రమలో ఆమె చేసిన ేసవలకుగానూ పలు అవార్డులు అందుకున్నారు. 1999లో పద్మశ్రీ అవార్డు ఆమెను పద్మశ్రీ వరించింది. 2004లో ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. ఆమె మరణం పట్ల పలువురు సినీ ప్రముఖు?ని సంతాపం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రి ఆమె అంత్యక్రియలు ముంబై ప్రభా మందిర్‌లో నిర్వహిస్తారు. (Sulochana Latkar Passed away)
బిగ్‌బీ అమితాబ్ బచ్చన్(Big B) సులోచన (Sulochana) మరణ వార్త భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘సినిమా ప్రపంచం మరో గొప్ప నటిని కోల్పోయింది. నేను నటించిన ఎన్నో గొప్ప చిత్రాల్లో లాలించే అమ్మగా నటించిన సీనియర్ నటి సులోచన మరణించడం బాధాకరం. ఈ మద్యకాలంలో ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్య విషయాన్ని కుటుంబ సభ్యులు ద్వారా తెలుసుకుంటున్నా. ఈలోపే ఇలా జరిగింది. ఆమె పవిత్ర ఆత్మకుశాంతి చేకూరాలి’’ అని అన్నారు.