Animal: నేను చెడును వెంటాడుతూ వెళ్ళాను, నాకెక్కడా కనపడలేదు

ABN , First Publish Date - 2023-09-28T18:33:37+05:30 IST

ఈరోజు రణబీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా అతని సినిమా 'యానిమల్' నుండి ఒక ప్రత్యేక టీజర్ ని విడుదల చేశారు. ఈ టీజర్ ఇప్పటికే ఆసక్తికరంగా వుంది వైరల్ అయింది. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకుడు కాగా రష్మిక మందన్న కథానాయకురాలు.

Animal: నేను చెడును వెంటాడుతూ వెళ్ళాను, నాకెక్కడా కనపడలేదు
Ranbir Kapoor from the film Animal

రణబీర్ కపూర్ (RanbirKapoor), సందీప్ రెడ్డి వంగా (SandeepReddyVanga) యాక్షన్ సినిమా ‘యానిమల్’ #Animal సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని చాలా ఆసక్తితో సినిమా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రీ-టీజర్‌తో ఆశ్చర్యపరిచిన ఈ చిత్ర నిర్వాహకులు, ఈరోజు రణబీర్ కపూర్ #HBDRanbirKapoor పుట్టినరోజు ప్రత్యేక సందర్భంలో ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ ప్రచార వీడియో రెండు నిమిషాల, 26 సెకన్ల వున్నా ఒక యాక్షన్ తో ప్యాక్ చేసి, ఇంటెన్స్, హై-ఆక్టేన్ స్టంట్‌లు, పవర్ ఫుల్ డైలాగ్‌లు, అద్భుతమైన విజువల్స్, బ్రిలియంట్ స్కోర్, వండర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ లతో అలరించింది.

animal1.jpg

ఈ టీజర్ తో ఈ సినిమా కథ కొంతవరకు ఊహించవచ్చు అని అనిపిస్తోంది. ఇది తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపించిన అనిల్ కపూర్ (AnilKapoor), రణబీర్ కపూర్ ల మధ్య జరిగిన ఓ కథగా చెప్పొచ్చు. వారిమధ్య చాలా సంక్లిష్టమైన సంబంధం వున్నట్లు అనిపిస్తుంది. తండ్రి తనపై చేయి చేసుకున్నప్పటికీ హీరో తన తండ్రిని 'ప్రపంచంలోని ఉత్తమ తండ్రి' అని నమ్ముతాడు. ఆ తరువాత కథానాయకుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగి వెరీ వైలెంట్ గా మారతాడు. బాబీ డియోల్ (BobbyDeol) చివరిలో విలన్ గా పరిచయమయ్యారు, కానీ అది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

animal2.jpg

ఈ ప్రచార టీజర్ ముందుగా పిల్లల గురించి రణబీర్, రష్మిక మందన్నల (RashmikaMandanna) మధ్య చర్చతో ప్రారంభమవుతుంది. ఆమె అతనిని ఏదైనా అడగవచ్చు, అతను నిజాయితీగా ఉంటాడు, కానీ తన తండ్రి గురించి ఎప్పుడూ మాట్లాడొద్దని చెప్తాడు. వీరి సంభాషణ జరుగుతున్నపుడు చూపించిన రక్తపాతం, కారు ఛేజింగ్‌లు, ఇంటెన్స్ ఎలిమెంట్స్ చాలా ఎక్సయిటింగా వున్నాయి.

రణబీర్ రెబల్ గా మారడం అలాగే అతన్ని చాలా రా అండ్ రస్టిక్ యాక్షన్ సన్నివేశాలలో చూపించటం ఇవనీ చూస్తుంటే, ఈ సినిమా కోసం రణబీర్ కొంచెం కష్టపడ్డాడు అనే తెలుస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అతని పాత్రను ప్రెజెంట్ చేయడంలో తన మార్క్ చూపించారు. ఈ చిత్రం డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో విడుదల కానుంది.

Updated Date - 2023-09-28T18:33:37+05:30 IST