Sooraj Pancholi: ఆ ప్రేమ దక్కలేదు.. డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకుంది!

ABN , First Publish Date - 2023-04-30T17:36:56+05:30 IST

‘నిశ్శబ్ద్‌’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు బాలీవుడ్‌ నటి జియాఖాన్‌(Jiah khan death). చేసింది తక్కువ చిత్రాలే అయినా మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది.

Sooraj Pancholi: ఆ ప్రేమ దక్కలేదు.. డిప్రెషన్‌తో  ఆత్మహత్య చేసుకుంది!

‘నిశ్శబ్ద్‌’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు బాలీవుడ్‌ నటి జియాఖాన్‌(Jiah khan death). చేసింది తక్కువ చిత్రాలే అయినా మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకుంది. కలలు కన్న జీవితం కోసం తాపత్రయపడింది. అయితే తను అనుకున్నట్లుగా జీవితం సాగలేదు. తను దీనస్థితిలో ఉన్నప్పుడు సూరజ్‌ పంచోలి (Sooraj Pancholi) ద్వారా జీవితంలో వెలుగొచ్చింది. అది శాశ్వతం కాదని అప్పుడు తెలుసుకోలేకపోయింది. అతడిని మనసారా ప్రేమించిన ఆమె 2013లో ఆత్మహత్య చేసుకుంది. సూరజ్‌ని ఎంతగా ప్రేమించిందో.. ప్రేయసిగా ఉన్న తనను ఎంతగా వేధించాడో ఆరు పేజీల సూసైడ్‌ నోట్‌లో రాసింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి సూరజ్‌ ప్రేరేపించినట్లు బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో ఈనెల 28న అతడిని నిర్దోషిగా కోర్టు తీర్పు ఇచ్చింది. (jiah khan suicide)

నిర్దోషిగా బయటికొచ్చిన సూరజ్‌ ముంబైలోని సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నాడు. అనంతరం ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. జియాఖాన్‌తో తన అనుబంధం గురించి మాట్లాడాడు. ‘‘నేను జియాతో ఐదు నెలలు మాత్రమే రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. తను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందో నాకు తెలియదు. కానీ ఆమె ప్రేమ కోరుకుంది. అది ప్రియుడు నుంచి మాత్రమే కాదు తన కుటుంబం నుంచి కూడా ప్రేమను ఆశించింది. ఆమె కుటుంబం తనను అర్థం చేసుకోవాలని, అండగా నిలవాలని తపన పడింది. ఆమె కుటుంబంలో సంపాదించేది తను ఒక్కరే కాబట్టి పోషించేందుకు ఎంతో కష్టపడింది. ఈ క్రమంలో ఒత్తిడికి కూడా లోనైంది. తను డిప్రెషన్‌లో ఉందని జియా తల్లి రబియా ఖాన్‌కు కూడా చెప్పాను. ఆమె పట్టించుకోలేదు. మెంటల్‌ హెల్త్‌ గురించి ఎవరికీ అంత అవగాహన లేదు. ప్రేమకంటే ముందు అంటే 2012లో మేమిద్దరం స్నేహితుల్లా ఉన్నాం. ఆ సమయంలోనూ తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. చేయి కోసుకుని చనిపోయేందుకు ప్రయత్నించింది. వెంటనే నేను లండన్‌లో ఉన్న జియా తల్లికి విషయాన్ని తెలియజేశాను. వెంటనే వస్తానని చెప్పి నెల గడిచినా రాలేదు. తల్లీకూతుళ్ల మధ్య ఇలాంటి ప్రేమే ఉంటుందా? తను ఇంటి సభ్యుల ప్రేమ కోరుకుంది. అది వాళ్లు ఇవ్వలేకపోయారు’’ అని సూరజ్‌ చెప్పారు.

Updated Date - 2023-04-30T18:23:51+05:30 IST