Sherlyn Chopra: ‘నాకు డబ్బుతోపాటు ఆ క్వాలిటీ ఉండే భర్త కావాలి’.. బోల్డ్ బ్యూటీ సంచలన కామెంట్స్

ABN , First Publish Date - 2023-04-02T16:30:13+05:30 IST

దోస్తీ: ఫ్రెండ్స్ ఫరెవర్’ (2005), ‘రెడ్ స్వస్తిక్’ (2007), ‘వజా తుమ్ హో’ (2016) వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి షెర్లిన్ చోప్రా..

Sherlyn Chopra: ‘నాకు డబ్బుతోపాటు ఆ క్వాలిటీ ఉండే భర్త కావాలి’.. బోల్డ్ బ్యూటీ సంచలన కామెంట్స్
Sherlyn Chopra

‘దోస్తీ: ఫ్రెండ్స్ ఫరెవర్’ (2005), ‘రెడ్ స్వస్తిక్’ (2007), ‘వజా తుమ్ హో’ (2016) వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు పొందిన నటి షెర్లిన్ చోప్రా (Sherlyn Chopra). దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈ భామకి సరైన అవకాశాలు రాలేదు. దీంతో కొన్ని అడల్ట్ కంటెంట్ సినిమాల్లో ఎక్కువగా నటించి పాపులారిటీ సాధించింది. అంతేకాకుండా.. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా, మరో నటి రాఖీ సావంత్‌తో వివాదాల కారణంగా ఇటీవలికాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అలాగే.. వివిధ అంశాలపై బోల్డ్‌ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన పెళ్లి విషయంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

షెర్లిన్ మాట్లాడుతూ.. ‘నాకు భర్త కావాలి. కాని అతను మిలియనీర్ అయ్యి ఉండాలి. అతను ఒకే మహిళను ఇష్టపడే వ్యక్తి అయ్యి ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. అతను నిజాయతీగా, మంచి మనసుతో ఉండాలి. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తిని నా కోసం భర్తగా వెతికిపెట్టమని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. (millionaire husband)

Sherlyn.jpg

అలాగే.. సినీ కెరీర్ గురించి షెర్లిన్ మాట్లాడుతూ.. ‘‘నన్ను ఇండస్ట్రీ మొత్తం రిజెక్ట్ చేసింది. మహేష్‌భట్, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు నన్ను తిరస్కరించారు. కానీ, ఎందుకనే కారణాలు తెలియవు. కాని నాతో.. నీలో విషయం లేదు. నువ్వు సాల్టీగా లేవ’ని అనేవారు. అందుకే ఇటీవల ఎక్కడికి వెళ్లిన నాతో పాటు సోడియం తీసుకెళుతున్నా. అయితే.. ఈ విశ్వం మాత్రం నాకు అవకాశాలు ఇచ్చింది. అందుకే వారందరి గురించి నేను పట్టించుకోను. ’ అని చెప్పుకొచ్చింది. అలాగే.. కెరీర్‌ మొదట్లో ఫెయిల్యూర్లు వచ్చినా, రిజెక్షన్లు వచ్చినా చనిపోదామని అనుకునేదాన్ని చెప్పింది. చనిపోయిన నా తండ్రిని స్వర్గంలో కలవడానికి సూసైడ్ చేసుకుందామనుకున్నానని తెలిపింది.

అలాగే.. రాఖీ సావంత్ (Rakhi Sawant) గురించి షెర్లిన్ మాట్లాడుతూ.. ‘రాఖీకి ఏ అవసరం వచ్చిన నేను సపోర్టుగా ఉన్నాను. అదిల్‌తో పెళ్లి విషయంలోనూ నేను తన వెనకే ఉన్నాను. కాని. తను అలా కాదు. తన పని అయిపోగానే నా గురించి పట్టించుకోలేదు. చివరికీ తన టీంలోని ఒకరు నన్ను మోసం చేసిన రాఖీ తనకి ఏం పట్టనట్టు ఉండిపోయింది’ అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..

Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..

IPS Sajjanar: దయచేసి అలా చేయకండి.. అమితాబ్‌కి టీఎస్‌ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్

Adipurush: మరోసారి ప్రభాస్ మూవీ పోస్టర్‌పై ట్రోలింగ్.. ఈసారి హనుమంతుడి గెటప్‌పై..

Dasara Twitter Review: నాని మొదటి పాన్ ఇండియా మూవీ ఎలా ఉందంటే..

Sridevi Shoban Babu OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన బావామరదళ్లు.. ఎక్కడ చూడొచ్చంటే..

Updated Date - 2023-04-02T16:31:25+05:30 IST