Dunki: ‘డంకీ డ్రాప్ 2’ లుట్ పుట్ గయా.. రొమాంటిక్ షారూక్ ఖాన్‌

ABN , First Publish Date - 2023-11-22T18:21:03+05:30 IST

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్‌, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డంకీ’. ఈ సినిమా డిసెంబ‌ర్ 21న విడువద‌ల అవుతున్న‌ది. ఈక్ర‌మంలో షారుకఖాన్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా న‌వంబ‌ర్‌2న డంకీ డ్రాప్‌1 పేర టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, ఈ రోజు బుధ‌వారం (న‌వంబ‌ర్ 22)న‌ డంకీ డ్రాప్ 2 - లుట్ పుట్ గ‌యా అనే రొమాంటిక్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

Dunki: ‘డంకీ డ్రాప్ 2’ లుట్ పుట్ గయా.. రొమాంటిక్ షారూక్ ఖాన్‌
dunki

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్ ఖాన్‌(Shah Rukh Khan), స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘డంకీ’(Dunki ). ఈ సినిమా డిసెంబ‌ర్ 21న విడువద‌ల అవుతున్న‌ది. ఈక్ర‌మంలో షారుకఖాన్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా న‌వంబ‌ర్‌2న డంకీ డ్రాప్‌1 పేర టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా, ఈ రోజు బుధ‌వారం (న‌వంబ‌ర్ 22)న‌ డంకీ డ్రాప్ 2 - లుట్ పుట్ గ‌యా (Dunki Drop2 Lutt Putt Gaya) అనే రొమాంటిక్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ఈ ప్ర‌పంచం ఏమ‌నుకున్నా ప‌ర్లేదు హ‌ర్డీకి అండ‌గా మ‌ను నిల‌బ‌డుతుందంటూ వారి మ‌ధ్య‌ ప్రేమ ప్ర‌యాణాన్ని, మ‌నుపై త‌న మ‌న‌సులోని భావ‌న‌ను హ‌ర్డీ పాట రూపంలో తెలియ‌జేసిన‌ట్టుగా చూపించారు. ఈ మెలోడీ పాట‌కు ప్రీత‌మ్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించ‌గా, అర్జిత్ సింగ్ త‌న గాత్రంతో ప్రాణం పోశారు. స్వానంద్ కిర్‌కిరే, ఐ.పి.సింగ్ ఈ పాట‌కు సాహిత్యాన్ని అందించారు. ట్యూన్‌కు త‌గ్గ‌ట్టు గ‌ణేష్ ఆచార్య చ‌క్క‌టి డాన్స్ మూమెంట్స్‌ను కంపోజ్ చేశారు. దీంతో పాట‌లోని రొమాంటిక్ ఫీల్‌కి అద‌న‌పు హంగు తోడైన‌ట్లు అనిపిస్తుంది.


హృద‌యానికి హ‌త్తుకునేలా చ‌క్క‌టి క‌థ‌ల‌ను సినిమాల రూపంలో తెర‌కెక్కించ‌టం లో సిద్ధ‌హ‌స్తుడైన‌ డైరెక్ట‌ర్ రాజ్‌కుమార్ హిరాణి ఇప్పుడు డంకీ వంటి మ‌రో మాస్ట‌ర్ పీస్‌తో చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే ఎమోష‌న్స్‌తో మ‌రోసారి మ‌న ముందుకు రాబోతున్నారు. న‌లుగురు స్నేహితులు వారి క‌ల‌ల‌ను నిజం చేసుకోవ‌టానికి విదేశాల‌కు వెళ్లాల‌ని అనుకునే క్ర‌మంలో వారెలాంటి ఆటుపోట్ల‌ను ఎదుర్కొన్నార‌నేదే ఈ చిత్రం క‌థాంశం. స్నేహం, ప్రేమ వంటి అంశాల‌తో నిజ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని డైరెక్ట‌ర్ రాజ్ కుమార్ అండ్ టీమ్‌ ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో బోమన్ ఇరాని, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తుండ‌గా, జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి(Raj kumar Hirani), గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభిజీత్ జోషి, రాజ్ కుమార్ హిరాణి, క‌ణిక థిల్లాన్ ఈ చిత్రానికి ర‌చ‌యిత‌లు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబ‌ర్‌21న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వుతుంది.

Updated Date - 2023-11-22T18:21:05+05:30 IST