Shah Rukh Khan: ‘పఠాన్’ కు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో!
ABN , First Publish Date - 2023-01-19T15:15:41+05:30 IST
పఠాన్ సినిమాను రూ.250కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రంలో నటించేందుకు షారూఖ్ ఖాన్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరోల్లో షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) ఒకరు. చివరగా ‘జీరో’ (Zero)లో నటించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. దీంతో సినిమాల నుంచి కింగ్ ఖాన్ కొంత కాలం బ్రేక్ తీసుకున్నాడు. నాలుగేళ్ల విరామం అనంతరం ‘పఠాన్’ (Pathaan) టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ బీ టౌన్లో హల్చల్ చేస్తుంది.
పఠాన్ సినిమాను రూ.250కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఈ చిత్రంలో నటించేందుకు షారూఖ్ ఖాన్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. రూ.35కోట్ల నుంచి రూ.40కోట్ల వరకు ఛార్జ్ చేశాడని సమాచారం. సినిమాకు వచ్చే లాభాల్లోను వాటా ఉందట. బాలీవుడ్‌లోని స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ‘పఠాన్’ ను యశ్‌రాజ్ ఫిలిమ్స్ నిర్మించింది. దీపికా పదుకొణె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించారు. ‘బ్యాంగ్ బ్యాంగ్’, ‘వార్’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సిద్దార్థ్ ఆనంద్ ‘పఠాన్’ ను తెరకెక్కించాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీలో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. బ్రేక్ తర్వాత షారూఖ్ వెండితెర మీద కనిపిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌ను ఒపెన్ చేయగా ఆడియన్స్ నుంచి స్పందన కూడా బాగుంది. ఈ సినిమా తొలి రోజు రూ.35కోట్ల నుంచి రూ.40కోట్ల వరకు వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.