Shah Rukh Khan: ASKSRK.. ఒక్క మెసేజ్‌... వరుసగా పార్శిల్స్‌తో షారుక్‌ ఇంటి ముందు!

ABN , First Publish Date - 2023-06-13T14:56:16+05:30 IST

షూటింగ్‌కు కాస్త విరామం దొరికిన షారుక్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ 20 నిమిషాలు అభిమానులతో చాట్‌ చేశారు. ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నారు. అభిమానులపై జోక్‌లు వేశారు. కొందరు అభిమానులు షారుక్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

Shah Rukh Khan: ASKSRK.. ఒక్క మెసేజ్‌... వరుసగా పార్శిల్స్‌తో షారుక్‌ ఇంటి ముందు!

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ఖాన్‌ (Shah Rukh Khan)చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ‘జవాన్‌’ (Jawaan) చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో ఉంది. ‘టైగర్‌3’లో అతిథి పాత్ర పోషిస్తున్నారు. ‘డంకీ’ (Dunki) చిత్రం చిత్రీకరణలో ఉంది. షూటింగ్‌కు కాస్త విరామం దొరికిన షారుక్‌ ట్విట్టర్‌ వేదికగా ఓ 20 నిమిషాలు అభిమానులతో చాట్‌ (#AskSrk) చేశారు. ఆసక్తికర విషయాలు షేర్‌ చేసుకున్నారు. అభిమానులపై జోక్‌లు వేశారు. కొందరు అభిమానులు షారుక్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ట్విట్టర్‌ చాట్‌లో ఓ అభిమాని ‘భోజనం చేశారా’? అని ప్రశ్నించారు. ఎందుకు భాయ్‌ మీరు స్విగ్గీ నుంచా? తినడానికి పంపిస్తారా? అని చమత్కరించారు. దానికి స్విగ్గీ టీమ్‌ స్పందించింది. అవును సర్‌ మేం స్విగ్గీ నుంచి.. మీకు భోజనం పంపించమంటారా? అని సమాధానమిచ్చారు. అంతే స్విగ్గీ టీమ్‌ ఓ ఏడు మంది పార్సిల్స్‌తో ముంబైలోని షారుక్‌ ఇంటి ముందు వాలిపోయారు. రకరకాల ఐటెమ్స్‌తో డెలివరీ ఇచ్చారు. అంతేకాదు షారుక్‌ ఇంటి గేట్‌ ముందు స్విగ్గీ టీమ్‌ తీసుకున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, షారుక్‌ చాట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది.

2.jpg

గూటిబిళ్ల అంటే ఇష్టం..

మరో నెటిజన్‌ ఓ వింత ప్రశ్న అడిగాడు. ‘సర్‌.. మీ దగ్గర ఉన్నది.. వేరే హీరోల దగ్గర లేనివి ఏంటని ప్రశ్నించగా షారుక్‌ ఆసక్తికర జవాబు ఇచ్చారు. ‘‘నా దగ్గర ‘దిల్‌ వాలే దుల్హానియా లే జాయేంగే’, ‘కుచ్‌కుచ్‌ హోతా హై’, ‘దేవదాస్‌’, ‘స్వదేశ్‌’, ‘చక్‌ దే ఇండియా’, పఠాన్‌, ‘ఓం శాంతి ఓం’ చిత్రాలు ఉన్నాయి. ఇవి వేరే హీరోల దగ్గర లేవు కదా? అని అన్నారు. అంతే కాదు చిన్నప్పుడు గూటిబిళ్ల అంటే బాగా ఇష్టమని షారుక్‌ చెప్పారు.

మిడిల్‌ క్లాస్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చిన మీరు ఎన్నో కష్టాలు చూశారు? ఈ జర్నీ మీకెలా అనిపిస్తుంది? అన్న ప్రశ్నకు.. ‘చాలా సింపుల్‌ భాయ్‌.. ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ చూపించిన ఆదరణ, ప్రేమ నన్ను ఇంతటి వాడిని చేశాయి. ఇక నాకు కష్టం ఎక్కడిది? లైఫ్‌ ఎంతో ఆనందంగా ముందుకెళ్తుంది’’ అని తనదైన శైలిలో జవాబు ఇచ్చారు.

Updated Date - 2023-06-13T15:07:55+05:30 IST