Shah Rukh Khan : చిన్న సన్నివేశంతో పడేశాడు.. భావోద్వేగానికి లోనైన బాద్షా!
ABN , First Publish Date - 2023-12-16T15:08:03+05:30 IST
స్కూల్ ఫంక్షన్లో తన తనయుడు అబ్రమ్ (Abram) చేసిన ఓ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యి భావోద్వేగానికి లోనయ్యారు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ (Shah rukh khan).
స్కూల్ ఫంక్షన్లో తన తనయుడు అబ్రమ్ (Abram) చేసిన ఓ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యి భావోద్వేగానికి లోనయ్యారు బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ (Shah rukh khan). అబ్రమ్ స్కూల్లో జరిగిన ఓ ఫంక్షన్ కు షారుక్, గౌరీఖాన్ , సుహానాతోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అక్కడి జరిగిన కల్చరల్ యాక్టివిటీస్‌లో భాగంగా అబ్రమ్ స్టేజ్‌పై ఓ షో చేశాడు. అందులో భావోద్వేగ సన్నివేశంలో 'గివ్ మి ఎ హగ్.. ఐ లవ్ హగ్’ అంటూ షారుక్‌ఖాన్ ఐకానిక్ ఫోజ్‌ను ఉన్నది ఉన్నటుగా ప్రదర్శించాడు అబ్రమ్.
వేదికపై ఆ సన్నివేశాన్ని చూసిన షారుక్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. షారుక్‌కు నట వారసుడు, తండ్రికి తగ్గ తనయుడు, ఇది షారుక్ గర్వించాల్సిన సమయం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడతున్నారు. ఈ ఏడాది పఠాన్, జవాన్ చిత్రాలతో సూపర్‌హిట్ అందుకున్నారు షారుక్. ఈ చిత్రాలు రాబట్టిన వసూళ్లు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ నెల 21న 'డంకీ' సినిమాతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు.