Shah Rukh Khan: ప్రపంచ దిగ్గజాలను వెనక్కి నెట్టి మరీ.. మొదటి ప్లేస్ కొట్టేశాడు..
ABN , First Publish Date - 2023-04-07T16:07:20+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేరుకి హిందీ నటుడైనప్పటికీ ఈయనకి దేశవ్యాప్తంగా ఇతర భాషల్లోనూ.. అలాగే విదేశాల్లోనూ షారుఖ్ అభిమానులు ఉన్నారు. అయితే.. గత కొంతకాలంగా ఆయన సినిమాలు వరుస ఫ్లాపులుగా మిగిలాయి. ఈ తరుణంలో వచ్చిన ‘పఠాన్’ చిత్రంతో షారుఖ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ చిత్రం ఆయన రేంజ్ ఏంటో మరో సారి చూపించింది. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తాజాగా ఆయన మరో అరుదైన ఘనట సాధించాడు. (Most influential people)
ప్రతి ఏడాది ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ మేగజైన్ ‘TIME100’ జాబితాని విడుదల చేస్తుంది. అందులో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఇన్‌స్పైర్ చేసే వ్యక్తుల జాబితాని విడుదల చేస్తుంది. దాని కోసం మేగజైన్ ఓ పోల్‌ని నిర్వహిస్తుంది. పాఠకులు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో స్థానం పొందేందుకు అత్యంత అర్హులని భావించే వ్యక్తులకు ఓటు వేస్తారు. ఈ ఆన్‌లైన్ పోల్‌లో ఈసారి 1.2 మిలియన్లకు పైగా పాఠకులు ఓట్లు వేశారు.
Also Read - Vivek Agnihotri: జీవితాలను నాశనం చేయడమే మీ అలవాటు.. బాలీవుడ్ దర్శకుడిపై సెటైర్లు
ఈ ఏడాదికి సంబంధించిన ఈ పోల్ ఫలితానుల టైమ్స్ తాజాగా విడుదల చేసింది. ఇందులో.. దాదాపు 4% శాతం ఓట్ల (50,000 ఓట్లు)ని సాధించి షారుఖ్ ఖాన్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచినట్లు ఆ మేగజైన్ ప్రకటించింది. అందులో.. ‘షారుఖ్ తాజా చిత్ర రూ.1000 కోట్ల వసూళ్లని సాధించింది. అందుకే నిస్సందేహంగా భారతదేశంలో ఆయన అత్యంత ప్రసిద్ధ నటుడు, ఇంటర్నేషన్ ఐకాన్’ కూడా అని పేర్కొంది. అయితే.. లియోనెల్ మెస్సీ (Lionel Messi), సెరెనా విలియమ్స్ (Serena Williams) వంటి స్పోర్ట్స్ స్టార్స్‌ని, ఎలోన్ మస్క్ (Elon Musk), మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) వంటి వ్యాపారవేత్తలని దాటి మరి ఆయన ప్రథమ స్థానాన్ని సాధించాడు.
పోల్‌లో 3% ఓట్లు సాధించి రెండో స్థానం దేశంలో స్వేచ్ఛ కోసం నిరసన తెలిపిన ఇరాన్ మహిళలు నిలవగా.. హెల్త్ కేర్ వర్కర్లు మొత్తం 2% ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే నాలుగో స్థానంలో నిలిచింది. వీరు మొత్తం ఓట్లలో 1.9% పొందారు. ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ మొత్తం 1.8% ఓట్లతో మొదటి ఐదు స్థానాల్లో నిలిచాడు. అయితే.. మేగజైన్ పూర్తి జాబితాను బహిర్గతం చేయనప్పటికీ.. ఈ లిస్ట్‌లో టెస్లా CEO, ట్విట్టర్ యజమాని ఎలోన్ మస్క్, మెటా చీఫ్ మార్క్ జుకర్‌బర్గ్, అలాగే.. ఈ సంవత్సరం ఉత్తమ నటి ఆస్కార్ విజేత మిచెల్ యోహ్, టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఉన్నారని టైమ్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి:
Balagam: ‘బలగం’ ఖాతాలో మరో అవార్డు.. మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డులు గెలిచిందంటే..
Salman Khan: హీరోయిన్‌కి ముద్దు ఇచ్చిన స్టార్ హీరో.. ఆ తర్వాత పక్కకి వెళ్లి ఏం చేశాడో తెలిస్తే..
Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..