SalmanKhan: ఈద్ పండగ రోజు తక్కువ కలెక్షన్ చేసిన సినిమా
ABN , First Publish Date - 2023-04-22T15:14:49+05:30 IST
ఈమధ్య కాలం లో విడుదల అయిన సల్మాన్ ఖాన్ సినిమాలతో పోలిస్తే నిన్న ఈద్ పండగ సందర్భంగా విడుదల అయిన 'కిసీ కీ భాయ్ కిసీ కా జాన్' సినిమా కలెక్షన్స్ ఎలా వున్నాయంటే...
సల్మాన్ ఖాన్ (Salman Khan) నటించిన 'కిసీ కీ భాయ్ కిసీ కా జాన్' #KisiKaBhaiKisiKiJaan ఈద్ (Eid) పండగను పురస్కరించుకొని విడుదల అయింది. ఈ సినిమాకి నిర్మాత కూడా సల్మాన్ ఖాన్ అవటం విశేషం. అయితే ఈ పండగని సల్మాన్ ఖాన్ సరిగ్గా కాష్ చేసుకోలేకపోయాడు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఈ సినిమాకి వచ్చిన మొదటి రోజు కలెక్షన్ మాత్రం సల్మాన్ అభిమానులకు మింగుడు పడటం లేదు. ఎందుకంటే ఈమధ్య కాలంలో విడుదల అయిన సల్మాన్ ఖాన్ సినిమాలతో పోలిస్తే, ఈ 'కిసీ కీ భాయ్ కిసీ కా జాన్' #KisiKaBhaiKisiKiJaan సినిమాకి చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయనే చెప్పాలి.
బాలీవుడ్ లో ట్రేడ్ అనలిస్ట్ అయిన తరన్ ఆదర్శ్ (TaranAdarsh) ఈ సినిమా రూ. 15 కోట్లకు పైగా వసూల్ చేసిందని చెప్పారు. ఇది సల్మాన్ కెరీర్ లో అదీ ఈద్ పండగ నాడు విడుదల అయిన సినిమాలన్నిట్లోకీ చాలా తక్కువ అని చెప్తున్నారు. అయితే అంతకు ముందు 2019 లో విడుదల అయిన 'భారత్' (Bharath) రూ. 42 కోట్ల పైన, దాని ముందు 'రేస్ 3' (Race 3) సుమారు రూ. 30 కోట్లు వసూల్ చేసిందని, ఇప్పుడు ఈ 'కిసీ కీ భాయ్ కిసీ క జాన్' #KisiKaBhaiKisiKiJaan సినిమా ఈద్ పండగని సరిగ్గా కాష్ చెయ్యలకేపోయిందని చెప్పారు.
ఈ సినిమా పోవడానికి దర్శకుడే సగం కారణం అని అంటున్నారు. ఎందుకంటే సల్మాన్ ఖాన్ ని ఈ సినిమాలో సరిగ్గా వాడుకోలేదని చెప్పారు. అలాగే ఈ సినిమాలో మన తెలుగు కి సంబందించిన వెంకటేష్ దగ్గుబాటి (Daggubati Venkatesh) కూడా వున్నాడు, కానీ అతని ఈ సినిమా ఎందుకు చేసినట్టు అని అడుగుతున్నారు . ఎందుకంటే వెంకీ పాత్ర అసలు బాగోలేదు అని అంటున్నారు.
ఇక ఇంకో కారణం సల్మాన్, పూజ హెగ్డే (Pooja Hegde) ల మధ్య ఆ కెమిస్ట్రీ సరిగ్గా కుదరలేదని అంటున్నారు.
ఇక నాలుగో కారణం సినిమా సెకండ్ హాఫ్ లో తెలుగు మాటలు బాగా మిక్స్ చేసేరు అది చాలా పెద్ద మైనస్ అని అంటున్నారు. ఎందుకంటే సెకండ్ హాఫ్ హైదరాబాద్ లో జరుగుతుంది అని. వెంకటేష్ కూడా సినిమాకి ఏమి హెల్ప్ కాలేదు సరికదా అతను కూడా మైనస్ అయ్యాడు అని అంటున్నారు.
సల్మాన్ ఖాన్ అభిమానులకి కూడా ఈ సినిమా నచ్చినట్టు కనపడటం లేదు. అదీ కాకుండా మొదటి రోజు చాలా నెగటివ్ టాక్ వచ్చింది, కలెక్షన్స్ బాగో లేవు, అవి ఇంప్రూవ్ అవుతాయి అవ్వటం కష్టమే అంటున్నారు.