Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం
ABN , First Publish Date - 2023-05-03T12:03:44+05:30 IST
సల్మాన్ ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయనకు ఎంతో ఇష్టమైన..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ విషాదానికి కారణమైన వ్యక్తి ఫొటోని సోషల్ మీడియా వేదికగా సల్మాన్ ఖాన్ షేర్ చేసి.. నివాళులు అర్పించారు. ఇంతకీ సల్మాన్ ఖాన్ ఇంట్లో ఏం జరిగిందంటే.. ఆయనకు ఎంతో ఇష్టమైన అడ్డు (Addu) ఆంటీ చనిపోయింది. ఆమె చనిపోయినట్లుగా తెలుపుతూ.. అడ్డు ఆంటీ ఆత్మకు శాంతి చేకూరాలని సల్మాన్ తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సల్మాన్ చేసిన ఈ పోస్ట్ చూసిన వారంతా.. ఎవరీ అడ్డు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సల్మాన్ ఖాన్ పోస్ట్ ప్రకారం.. అడ్డు కేర్ టేకర్ అని తెలుస్తోంది. ‘‘ప్రియమైన అడ్డూ.. నేను పెరిగే క్రమంలో మీరు అందించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని సల్మాన్ ఖాన్ (Salman Khan Post on Addu) తన పోస్ట్‌లో తెలిపారు. దీనికి నెటిజన్లు, సల్మాన్ అభిమానులు కూడా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కామెంట్స్ చేస్తున్నారు. సల్మాన్ గురించి తెలిసిన వాళ్లు.. చిన్నప్పటి నుంచి సల్మాన్ బాగోగులు చూసుకున్న కేర్ టేకరే ఈ అడ్డు అని కామెంట్స్‌లో తెలుపుతున్నారు.
సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.. హీరోగా ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో.. అలాగే వివాదాల విషయంలోనూ ఆయన పేరు అలాగే వినిపిస్తుంటుంది. ఎన్ని వివాదాలు ఉన్నా సరే.. ఆయనపై అభిమానుల ప్రేమలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. ఆయనకు కోట్లాది అభిమానులు ఉన్నారు. రీసెంట్‌గా ఆయన నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) చిత్రం ‘రంజాన్’ స్పెషల్‌గా విడుదలైంది. కానీ.. అనుకున్నంతగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించలేకపోయింది. బాలీవుడ్ (Bollywood) వరకు పర్లేదు అనిపించుకున్న ఈ చిత్రం.. ఇతర భాషల్లో మాత్రం దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం సల్మాన్ ‘టైగర్ 3’ (Tiger 3) అనే చిత్రంలో నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Actress Shalini: నా విడాకులు వారికి అంకితం.. డివోర్స్ ఫొటోషూట్‌తో నటి హల్చల్
*Vimanam: మరో ‘బలగం’ అయ్యే లక్షణాలు పుష్కలంగా కనబడుతున్నాయ్..
*I am Salman: సల్మాన్ ఖాన్ ఇలా మారిపోయాడేంటి? గ్రూట్ ఎంత పని చేశావ్..
*JD Chakravarthy: ఆ టైటిల్ కొట్టేద్దామనుకున్నా..
*Heat Trailer Talk: ప్రత్యర్థిని అంచనా వేసేవాడు.. ప్రెజర్‌ను హ్యాండిల్ చేసేవాడే విన్నర్
* The Kerala Story: కథ నిజమని నిరూపించండి.. కోటీశ్వరులు కండి!