Sai Pallavi: హిందీలో ఆరంగేట్రం చేస్తున్న సాయి పల్లవి, హీరో ఎవరో తెలిస్తే షాక్ !

ABN , First Publish Date - 2023-09-13T14:34:07+05:30 IST

దక్షిణాదిలో ఒక మంచి పేరు, విపరీతమైన అభిమానులని సంపాదించిన సాయి పల్లవి ఇప్పుడు హిందీలో ఆరంగేట్రం చేయనున్నారు. అయితే ఆమె పక్కన నటించే అతను ఖాన్ కుటుంబం నుండి వచ్చిన అతను, ఇంతకీ అతను ఎవరంటే...

Sai Pallavi: హిందీలో ఆరంగేట్రం చేస్తున్న సాయి పల్లవి, హీరో ఎవరో తెలిస్తే షాక్ !
Sai Pallavi

ఇప్పుడు హిందీ మీడియా వార్తల్లో దక్షిణాదికి చెందిన టాలెంటెడ్ నటి సాయి పల్లవి (SaiPallavi) పేరు వినపడుతోంది. అయితే అదేదో వివాదంలో కాదు, సాయి పల్లవి త్వరలోనే తన హిందీ సినిమా చేయబోతోంది అని. ఇంతకీ ఆమె ఎవరి పక్కన చేస్తోందో తెలిస్తే, అందరూ షాకవుతారు. ఆమె కథానాయకురాలిగా, అమీర్ ఖాన్ (AamirKhan) కుమారుడు జునైద్ ఖాన్ (JunaidKhan) కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కబోతోంది అని కథనాలు వస్తున్నాయి.(Sai Pallavi is all set to debut in Hindi films)

junaidkhan.jpg

ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది అని కూడా వార్తలు రాస్తున్నారు. దీనికి సునీల్ పాండే (SunilPandey) దర్శకత్వం వహిస్తున్నాడు అని, ఇది ఒక ప్రేమ కథా చిత్రం అని కూడా అంటున్నారు. అయితే ఇది శేఖర్ కమ్ముల (SekharKammula) తీసిన 'లవ్ స్టోరీ' (LoveStory) లా ఉండొచ్చు అని కూడా తెలిసింది. ఈమధ్య దక్షిణాదికి చెందిన హిట్ అయిన సినిమాలు ఎక్కువగా హిందీలో రీమేక్ అవుతున్నాయి. 'లవ్ స్టోరీ' #LoveStory సినిమాలో సాయి పల్లవి నటించింది, ఇందులో నాగ చైతన్య (NagaChaitanya) కథానాయకుడు. ఇది పెద్ద హిట్ అయింది.

saipallavi2.jpg

అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ అంతగా అందరితో కలవడానికి ఇష్టపడే వ్యక్తి కాదు. అందుకనే ఎప్పుడూ వార్తల్లో కనపడడు ఎక్కువగా. ఇప్పుడు అతను యాష్ రాజ్ ఫిలిమ్స్ (YRF) తో ఒక సినిమా చేస్తున్నాడని, అది అయిపోగానే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ధియేటర్ లో సుమారు మూడేళ్లు అనుభవం వుంది జునైద్ కి, అలాగే 'పికె' #PK సినిమాకి అసిస్టెంట్ దర్శకుడిగా కూడా పని చేసాడు జునైద్. ఇప్పుడు సినిమాల్లోకి ఆరంగేట్రం చేస్తున్నాడు.

Updated Date - 2023-09-13T14:34:07+05:30 IST