Sushanth singh - Rhea Chakraborty : అతను లేని జీవితం చాలా కష్టంగా ఉంది.. కానీ!

ABN , First Publish Date - 2023-10-06T13:51:40+05:30 IST

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushanth singh rajputh) మరణించి ఈ ఏడాది జూన్ 13కి మూడేళ్లు పూర్తయింది. ఇప్పటికీ అతని కేస్‌ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. సుశాంత్‌ మరణం విషయంలో అతని స్నేహితురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.

Sushanth singh  - Rhea Chakraborty : అతను లేని జీవితం చాలా కష్టంగా ఉంది.. కానీ!

బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushanth singh rajputh) మరణించి ఈ ఏడాది జూన్ 13కి మూడేళ్లు పూర్తయింది. ఇప్పటికీ అతని కేస్‌ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. సుశాంత్‌ మరణం విషయంలో అతని స్నేహితురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty) ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఆమె కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడనే రూమర్లు కూడా వచ్చాయి. పోలీసులు పలుమార్లు విచారించారు కూడా. ఇప్పటికీ ఆ కేసు ఓ కొలిక్కి రాలేదు. ఇంతకాలం మీడియాకు దూరంగా ఉన్న ఆమె తాజాగా ఓ వేడుక కారణంగా మీడియా ముందుకొచ్చింది. సుశాంత్‌ మరణం తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని తెలిపింది.

Sushanth.gif

ఆ మేరకు ఆమె మాట్లాడుతూ ‘‘జీవించాలనే సంకల్పం చాలా పెద్దది. మనం మనుషులం కాబట్టి జీవితంలో ఏది జరిగినా ముందుకు వెళ్లక తప్పదు. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తి సుశాంత. అతన్ని కోల్పోయాను. ఆ విషాదం నుంచి నేను సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టింది. మెయిన సీ్ట్రమ్‌ మీడియా, సోషల్‌ మీడియాలో నాపై ఎన్నో కథనాలు వచ్చాయి. అవి నన్ను కుంగదీయడంతోపాటు ఎంతో నష్టపోయేలా చేశాయి. చివరికి నేను ఏడవడానికీ వాళ్లు నాకు సమయం ఇవ్వలేదు. ఎన్నో సంఘర్షణలను దాటి ఇక్కడిదాకా వచ్చాను. ఇక సుశాంత్‌ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. నా జీవితమంతా అతడిని మిస్‌ అవుతూనే ఉంటాను. నా స్నేహితుడు, సహచరుడు లేకుండా జీవించడం చాలా కష్టంగా ఉంది. కానీ, ముందుకు వెళ్లక తప్పదు. మా నాన్న భారత సైన్యంలో పనిచేశారు. కష్టాలకు కుంగిపోకుండా ఉండాలని, వాటిని అధిగమించే ప్రయత్నిస్తూనే ఉండాలని ఆయన మాకు నేర్పించారు. ఆ ధైర్యంతోనే ముందుకు సాగుతున్నా. ’ అని రియా చక్రవర్తి అని అన్నారు.

Updated Date - 2023-10-06T13:57:42+05:30 IST