Rashmika Mandanna : ఆ సినిమా తరహాలోనే.. పెద్ద హిట్‌ అవుతుంది!

ABN , First Publish Date - 2023-11-24T12:26:58+05:30 IST

'యానిమల్‌' (Animal) చిత్రంపై హీరోయిన్ రష్మిక (Rashmika mandanna )సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జున్ రెడ్డి తరహాలోనే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘యానిమల్‌’ ట్రైలర్‌ లాంచ్  ఈవెంట్‌లో ఆమె చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. "

Rashmika Mandanna : ఆ సినిమా తరహాలోనే.. పెద్ద హిట్‌ అవుతుంది!

'యానిమల్‌' (Animal) చిత్రంపై హీరోయిన్ రష్మిక (Rashmika mandanna )సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్జున్ రెడ్డి తరహాలోనే ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ‘యానిమల్‌’ ట్రైలర్‌ లాంచ్  ఈవెంట్‌లో ఆమె చేసిన కామెంట్స్‌ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. "సందీప్‌రెడ్డి వంగా ఎక్కడా రాజీ పడకుండా ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాకు యువత నుంచి ఎంతో ఆదరణ దక్కింది. అలాగే విమర్శలు వచ్చాయి. అయితే సినిమా మాత్రం పెద్ద హిట్‌ అయింది. ‘‘అర్జున్‌ రెడ్డి’(Arjun reddy) లో వయలెన్స్‌ ఎక్కువ ఉంటుందని కొందరు అంటారు. కానీ, నాకు అలా ఏమీ అనిపించలేదు, అది కూడా సహజంగానే అనిపిస్తుంది. ఆ సినిమా ఎంత వినోదాన్ని అందించిందో.. ‘యానిమల్‌’ కూడా అదే స్థాయిలో అలరిస్తుంది. ఇందులో నటించడం నాకు మంచి అనుభూతినిచ్చింది’ అని అన్నారు.

తాజాగా ఇదే విషయంపై హీరో రణ్‌బీర్‌ కపూర్‌ కూడా మాట్లాడారు. ''యానిమల్‌ చిత్రం ఎంతో పవర్‌ఫుల్‌ అని తెలిపారు. ఇందులో తన పాత్రపై అర్జున్‌ రెడ్డి ప్రభావం కొంత ఉంటుందన్నారు. సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు. పలుమార్లు విడుదల వాయిదా పడిన ఈచిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేయగా అది ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌ లాంటి మీరోలు సైతం సోషల్‌ మీడియాలో ఈ ట్రైలర్‌ గురించి రాసుకొచ్చారు. తండ్రీకొడుకుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా బాబీ దేవోల్‌ నటించారు.

Updated Date - 2023-11-24T12:26:59+05:30 IST