Rani Mukerji: నా భర్త చాలా మంది హీరోయిన్స్‌తో చేస్తున్నారు.. నేను ఎందుకు ఇతర నిర్మాతలతో చేయకూడదు..

ABN , First Publish Date - 2023-03-11T16:31:46+05:30 IST

బాలీవుడ్ నటి రాణి ముఖర్జి (Rani Mukerji) తాజాగా నటించిన సినిమా ‘మిసెస్ చటర్జి వర్సెస్ నార్వే’ (Mrs Chatterjee Vs Norway). రియల్ ఘటనను స్ఫూర్తిగా తీసుకొని చిత్రం రూపొందింది. ఆశిమ చిబ్బే (Ashima Chibbe) తెరకెక్కించారు.

Rani Mukerji: నా భర్త చాలా మంది హీరోయిన్స్‌తో చేస్తున్నారు.. నేను ఎందుకు ఇతర నిర్మాతలతో చేయకూడదు..

బాలీవుడ్ నటి రాణి ముఖర్జి (Rani Mukerji) తాజాగా నటించిన సినిమా ‘మిసెస్ చటర్జి వర్సెస్ నార్వే’ (Mrs Chatterjee Vs Norway). రియల్ ఘటనను స్ఫూర్తిగా తీసుకొని చిత్రం రూపొందింది. ఆశిమ చిబ్బే (Ashima Chibbe) తెరకెక్కించారు. ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా రాణి మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు.

బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా (Aditya Chopra) ను రాణి ముఖర్జి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆదిత్య చోప్రాకు సొంత నిర్మాణ సంస్థతో పాటు, డిస్ట్రిబ్యూషన్ హౌస్, స్టూడియో కూడా ఉంది. అయినప్పటికి తాను ఇతర నిర్మాతలతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్టు రాణి తెలిపారు. ‘‘నా భర్త చాలా మంది హీరోయిన్స్‌తో పనిచేస్తారు.. ఇతర నిర్మాతలతో నేను ఎందుకు పని చేయకూడదు..? నాకు మంచి స్క్రిఫ్ట్ కావాలి. యశ్‌రాజ్ ఫిలిమ్స్ అయిన ఏదైనా సరే నాకు ఓకే. ఈ చిత్రాన్ని చూసి ఆదిత్య చోప్రా భావోద్వేగానికి గురయ్యారు. ఏదైనా మూవీని చూసి ఆయన చలించిపోవడం అనేది చాలా తక్కువసార్లు జరుగుతుంది. ఆయన నా నటనను కూడా మెచ్చుకున్నారు’’ అని రాణి ముఖర్జి చెప్పారు.

‘మిసెస్ చటర్జి వర్సెస్ నార్వే’ లో రాణి ముఖర్జి ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించారు. ఈ మూవీ ట్రైలర్‌కు అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించాయి. ట్రైలర్‌లో.. చటర్జి కుటుంబంలో అనుకోకుండా సంక్షోభం తలెత్తుతుంది. ఆమె పిల్లలను జాగ్రత్తగా చూసుకోలేరని ప్రభుత్వం భావిస్తుంది. వారిని తాత్కాలిక కస్టడీలోకి తీసుకుంటుంది. ఇటువంటి సమయంలో నార్వే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె ఏ విధంగా పోరాడింది..? తమ పిల్లలను ఏలా కాపాడుకుంది..? అనే అంశాలతో చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Pawan Kalyan: ఒక్క రోజుకు రూ.3కోట్ల రెమ్యునరేషన్!

Ileana D’Cruz: నిషేధంపై స్పందించిన కోలీవుడ్ నిర్మాతలు

Ram Charan: ‘ఆర్‌సీ15’ కోసం పలు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయించిన మేకర్స్..!

Ram Charan: మెగా పవర్ స్టార్ హాలీవుడ్ సినిమా!

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-11T16:31:48+05:30 IST