Animal: ‘యానిమల్’ ఎక్కడ గర్జిస్తుందో చూశారా..
ABN , First Publish Date - 2023-11-18T18:18:08+05:30 IST
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ చిత్రం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా వద్ద అద్భుతం సృష్టించింది. దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద జరిగిన లార్జ్ దెన్ లైఫ్, గ్రాండ్ ఈవెంట్‌లో బుర్జ్ ఖలీఫాపై యానిమల్ స్పెషల్ కట్‌ని ప్రదర్శించారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన ‘యానిమల్’ (Animal) చిత్రం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) వద్ద అద్భుతం సృష్టించింది. దుబాయ్‌లోని ఐకానిక్ బుర్జ్ ఖలీఫా వద్ద జరిగిన లార్జ్ దెన్ లైఫ్, గ్రాండ్ ఈవెంట్‌లో బుర్జ్ ఖలీఫాపై యానిమల్ స్పెషల్ కట్‌ని ప్రదర్శించారు. రణబీర్ కపూర్, బాబీ డియోల్ (Bobby Deol)తో పాటు నిర్మాత భూషణ్ కుమార్ (Bhushan Kumar) వేదికపై సందడి చేశారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌ని చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సహా నిర్మాతలు శివ చనన, ప్రణయ్ రెడ్డి వంగా కూడా ఈ గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.
ఇటీవలే ఈ చిత్ర యూనిట్ మాన్‌హాటన్ ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ (Manhattan’s iconic Times Square)లో సందడి చేసిన విషయం తెలిసిందే. అక్కడి డిజిటల్ బిల్‌బోర్డ్‌లపై ప్రదర్శించిన టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో ఈ సినిమా గ్లోబల్ దృష్టిని ఆకర్షించింది. తాజాగా బుర్జ్ ఖలీఫా ఈవెంట్ ‘యానిమల్’ (Animal Movie) గ్రాండియర్‌కి ప్రతీకగా నిలుస్తూ.. లార్జర్-దేన్-లైఫ్ నెరేటివ్‌కి సరైన కాన్వాస్‌ను అందించి సినిమా రేంజ్ గురించి అంతా మాట్లాడుకునేలా చేస్తోంది.
తెలుగు దర్శకుడు సందీప్ వంగా (Sandeep Reddy Vanga) డైరెక్ట్ చేసిన ఈ ‘యానిమల్’ చిత్రంలో రణబీర్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న (Rashmika Mandanna), అనిల్ కపూర్ (Anil Kapoor) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ టి-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రేక్షకులకు గొప్ప థ్రిల్ రైడ్‌ని అందించేందుకు ఈ క్రైమ్ డ్రామాని 1 డిసెంబర్, 2023న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
ఇవి కూడా చదవండి:
========================
*Siren Teaser: మంచోడు.. మహా మంచోడిలా నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా?
********************************
*Unstoppable with NBK: ‘వైల్డెస్ట్ ఎపిసోడ్ ప్రోమో’.. బాలయ్యను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ హీరో..!
********************************
*Varalaxmi Sarathkumar: ‘కోట బొమ్మాళి పీఎస్’ ఎలా ఉంటుందంటే..?
************************************