Ranbir Kapoor: ఆ జానర్ సినిమాలు ఇక నడవవు.. అందుకే చేయట్లేదు..

ABN , First Publish Date - 2023-03-07T10:39:00+05:30 IST

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌ (Ranbir Kapoor)కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Ranbir Kapoor: ఆ జానర్ సినిమాలు ఇక నడవవు.. అందుకే చేయట్లేదు..
Ranbir kapoor

బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్‌ (Ranbir Kapoor)కి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ నటుడికి మహిళా అభిమానులు ఎక్కువ. దానికి కారణం మొదట్లో ఆయన ఎక్కువగా రోమ్-కామ్ (Rom-Com) చిత్రాలు చేయడమే. అవి సూపర్ హిట్లు కావడంతో రణ్‌బీర్‌కి మంచి క్రేజ్ వచ్చింది. అయితే.. చాలా కాలంగా ఆయన అలాంటి జానర్ చిత్రాలు చేయడం లేదు. దానికి కారణాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ వెల్లడించాడు.

రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘నేను రోమ్ కామ్ చిత్రాలు చేయకపోడానికి చాలా కారణాలు ఉన్నాయి. నేను కావాలనే చేయలేదు. అయితే.. అలాంటి కథలు చాలా వచ్చాయి. కానీ.. నా సినిమాలు షూటింగ్‌కి, విడుదలకి చాలా సమయం తీసుకునేవి. ఆ సమయంలో బర్ఫీ రెండు సంవత్సరాలు తీసుకుంది. అలాగే రాక్‌స్టార్‌కి సైతం చాలా సమయం పట్టింది. అలాగే రోమ్ - కామ్ చిత్రాలు నాకు నచ్చలేదు. అందులో కొత్తదనం ఏం లేదు. అందుకే రిజెక్ట్ చేశాను. అలాగే భవిష్యత్తులోనూ ఆ మూవీస్ చేసే అవకాశం లేదు. ప్రేక్షకులు అంతకంటే గొప్పి సినిమాలు కోరుకుంటున్నారు’ అని చెప్పుకొచ్చాడు.

అయితే.. రణ్‌బీర్ నటించిన తాజా చిత్రం ‘తూ ఝూఠీ మై మక్కర్’ (Tu Jhoothi Mai Makkaar). శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. కాగా.. రణ్‌బీర్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు

Ranbir Kapoor: అలాంటి పాత్ర చేయాలనుంది.. అల్లు అర్జున్‌పై బాలీవుడ్ నటుడి ప్రశంసలు

Samantha: ‘నీదే అందం.. నువ్వే మృగం’.. వైరల్ అవుతున్న సమంత పోస్ట్

Rashmika Mandanna: బాలీవుడ్‌కి వెళితే ఇలా తయారవుతారా?.. రష్మికపై విపరీతమైన ట్రోలింగ్

Updated Date - 2023-03-07T10:42:46+05:30 IST