Ranbir Kapoor: ‘నా కూతురు ఆలియాలా అస్సలు అవ్వకూడదు’.. బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్‌కి కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2023-03-08T14:25:14+05:30 IST

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు.

Ranbir Kapoor: ‘నా కూతురు ఆలియాలా అస్సలు అవ్వకూడదు’.. బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్‌కి కారణం ఏంటంటే..
Ranbir kapoor

బాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న నటుల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. ఈ యువ నటుడు ఇటీవల వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘తూ ఝాఠీ మై మక్కర్’ (Tu Jhooti Main Makkaar). లవ్ రంజన్ (Luv Ranjan) దర్శకత్వంలో వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor) హీరోయిన్‌గా నటించింది. తాజాగా విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రణ్‌బీర్ మాట్లాడుతూ.. భార్య ఆలియా భట్ (Alia Bhatt), కూతురు రాహా కపూర్ (Raha Kapoor) గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

రణ్‌బీర్ మాట్లాడుతూ.. ‘నా కూతురిని చూస్తే ఆలియాని చూసినట్లే ఉంటుంది. రాహాకి తన తల్లి పోలికలే ఎక్కువగా వచ్చాయి. అలా కనిపిస్తేనే తాను అందంగా అనిపిస్తుంది కూడా. అయితే.. రాహాని ఆలియా ప్రవర్తన మాత్రం రాకూడని కోరుకుంటున్నా. ఎందుకంటే.. ఆలియా చాలా గట్టిగా, ఎక్కువగా మాట్లాడుతుంది. రాహా కూడా నా భార్య ఎక్కువగా మాట్లాడే వ్యక్తి అయితే నా పని అయిపోతుంది. ఇలాంటి ఇద్దరు అమ్మాయిలను మేనేజ్ చేయడం నాకు కష్టం అవుతుంది. అందుకే రాహా కొంచెం రిజర్వ్డ్‌గా ఉంటుందని ఆశిస్తున్నా. అలా అయితే ఇద్దరం కలిసి ఆలియాని సులభంగా మేనేజ్ చేయగలం’ అని నవ్వుతూ చెప్పుకొచ్చాడు. (#TuJhootiMainMakkaar)

కాగా.. రణ్‌బీర్ ప్రస్తుతం సందీప రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ చేస్తున్నాడు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్. అలాగే బ్రహ్మాస్త్ర 2, బ్రహ్మాస్త్ర 3 కూడా ఈ నటుడి చేతిలో ఉన్నాయి. అలాగే మరికొన్ని కథలు సైతం చర్చల దశల ఉన్నాయి. #TJMM

ఇవి కూడా చదవండి:

Anicka: హీరోయిన్‌ని ముఖం వాచిపోయేలా కొట్టిన మాజీ ప్రియుడు.. అసలు విషయం ఏమిటంటే?

Video Viral: ‘కేజీఎఫ్’ కాంట్రవర్సీ.. సారీ కాని సారీ చెప్పిన వెంకటేశ్ మహా

Kushboo Sundar : కన్నతండ్రే నన్ను లైంగికంగా వేధించాడు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన నటి

Manchu Manoj Weds Mounika reddy: ముహూర్తం ఫిక్స్.. అతి కొద్దిమంది సమక్షంలో..

Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరో తెలుసా?

Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోలకు పవన్ క్షమాపణలు.. కారణం ఏంటంటే..

Rashmi Gautam: ‘ఇది దారుణం.. వాడి లవర్ వాడి ఇష్టమంట’.. నాగశౌర్యకి సపోర్టుగా రష్మి పోస్టు


Updated Date - 2023-03-08T14:25:15+05:30 IST