Ranbir Kapoor and Alia Bhatt: దయచేసి ఆ పనిమాత్రం చేయకండి.. మీడియాకి రిక్వెస్ట్ చేసిన సెలబ్రిటీ కపుల్
ABN , First Publish Date - 2023-01-08T11:51:52+05:30 IST
బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) జంట ఒకటి. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత ఏప్రిల్ 14, 2022న వీరు వివాహం చేసుకున్నారు.
బాలీవుడ్‌లోని క్రేజీ కపుల్స్‌లో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్ (Alia Bhatt) జంట ఒకటి. దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం తర్వాత ఏప్రిల్ 14, 2022న వీరు వివాహం చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ లవ్‌బర్డ్స్ పెళ్లీపీటలు ఎక్కారు. అనంతరం కొన్ని నెలల తర్వాత ఈ జంటకి రాహా (Raha) అనే కూతురు పుట్టింది. కానీ ఇంతవరకు కూతురి పిక్స్ (Pics) బయటికి రాకుండా ఈ జంట గోప్యంగా ఉంచింది.
ఈ తరుణంలోనే తాజాగా ఈ జంట ఫొటోగ్రాఫర్లను వ్యక్తిగతంగా కలిసి తమ కొన్ని రోజుల పాటు తమ కూతురి ఫొటోలు తీయొద్దని అభ్యర్థించారు. తమ బిడ్డను మీడియా నుంచి దూరంగా ఉంచడానికి అన్ని కారణాలను స్పష్టంగా వివరించారు. తనకి సరైన వయస్సు వచ్చి, సమయంలో వచ్చినప్పుడు తన ఫొటోలను తీసుకోడానికి అనుమతిస్తామని హామీ ఇచ్చారు.
కాగా.. ఈ దంపతులు కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ’ సూపర్‌హిట్ అయ్యింది. ఈ జంట మొదటి సారి కలిసి నటించిన ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. ఈ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. కాగా.. రణ్‌బీర్ ప్రస్తుతం ‘యానిమల్’తో కొన్ని సినిమాల్లో నటిస్తుండగా.. ఆలియా సైతం ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని’తో పాటు ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.