The kerala Story: అసాధారణ విజయమిది.. ఎవరూ ఆపలేరు
ABN , First Publish Date - 2023-05-08T16:46:17+05:30 IST
హిందీలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ (The kerala story) దేశమంతా సంచలనంగా మారింది. విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకున్న ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
హిందీలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ (The kerala story) దేశమంతా సంచలనంగా మారింది. విడుదలకు ముందు వివాదాల్లో చిక్కుకున్న ఈ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2018-19లో మిస్ అయిన 32,000 మంది అమ్మాయిలు ఎక్కడున్నారు? ఏమైపోయారు? అని పట్టించుకునేవాళ్లే లేరు అన్న ఇతివృత్తంతో రూపొందిన చిత్రమిది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు. కేరళలో మతపరమైన విభజన, ద్వేషాన్ని ప్రచారం చేయాలనే ఉద్దేశంతోనే (comments on The kerala story) కొందరు ఈ చిత్రం తీశారని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కామెంట్ చేశారు. అక్కడి అధికార పార్టీ, ప్రతిపక్షాలు సినిమా విడుదల నిలిపేయాలంటూ డిమాండ్ చేశాయి. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం దేశమంతటా ప్రకంపనలు సృష్టిస్తుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్కువశాతం చిత్రం బావుందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. కొందరైతే ఓ వర్గాన్ని కించపరిచేలా ఉందని నొచ్చుకుంటున్నారు. (Rgv Praises Kerala story)
తాజాగా ఈ చిత్రం రామ్‌గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించాడు. ‘‘తమిళ-మలయాళీ అమ్మాయిలు హీరోయిన్లుగా గుజరాతీ నిర్మాత, బెంగాలీ డైరెక్టర్.. హిందీ భాషలో తీసిన ఈ చిత్రం అన్నిభాషల్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అసలైన పాన్ ఇండియా చిత్రమంటే ఇదే’’ అని ట్వీట్ చేశారు. అయితే విమర్శలకు కేరాఫ్ అయిన వర్మ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ‘నువ్వు పాజిటివ్‌గా స్పందించావంటే ఆశ్చర్యంగా ఉంది’, ‘ప్యాన్ ఇండియా సినిమా అంటున్నారు బాగుందా? బాలేదా? అన్నది చెప్పట్లేదు ఏంటి అని వర్మను ప్రశ్నిస్తున్నారు. అని ఏమీ చెప్పట్లేదు ఏంటి?’ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాపై బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ కూడా ప్రశంసించారు. ‘ద కేరళ స్టోరీ’ పవర్‌ఫుల్ సినిమా అని కొనియాడారు. ఈ చిత్రాన్ని ఎవరూ ఆపలేరని, థియేటర్స్‌ని షేక్ చేస్తుందని, అసాధారణమైన విజయాన్ని అందుకొందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఓ పక్క ఐపీఎల్, హాలీవుడ్ చిత్రం ‘గార్డియన్ ఆఫ్ ద గెలాక్సీ’ ఉన్నప్పటికీ కలెక్షన్లు (Super collections For Kerala story) అదిరిపోతున్నాయి. శుక్రవారం రూ.8.02 కోట్లు, శనివారం రూ.11.22 కోట్లు, ఆదివారం రూ.16 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఇప్పటివరకు ఈ మూవీ రూ.35 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది’ అని తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.