Priyanka Chopra: ఆభరణాలంటే ఇష్టం లేదు.. కానీ కోటిన్నర పెట్టి..

ABN , First Publish Date - 2023-04-09T16:44:23+05:30 IST

బాలీవుడ్‌లో హీరోల ఆధిపత్యమే ఎక్కువ. పారితోషికాలు... పేరూ వాళ్లకే. అవన్నీ తట్టుకొని తాను కూడా ఓ స్టార్‌గా వెలిగింది ప్రియాంక చోప్రా (Priyanka Chopra)..

Priyanka Chopra: ఆభరణాలంటే ఇష్టం లేదు.. కానీ కోటిన్నర పెట్టి..
Priyanka Chopra

బాలీవుడ్‌లో హీరోల ఆధిపత్యమే ఎక్కువ. పారితోషికాలు... పేరూ వాళ్లకే. అవన్నీ తట్టుకొని తాను కూడా ఓ స్టార్‌గా వెలిగింది ప్రియాంక చోప్రా (Priyanka Chopra). షారుక్‌, సల్మాన్‌, అమీర్‌కు పోటీగా ఎదిగింది. అంతర్జాతీయ చిత్రాల్లో కూడా ప్రియాంక రాణిస్తోందంటే.. మామూలు విషయం కాదు. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన ప్రియాంకకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలివి..

అమ్మనే రోల్‌మోడల్‌..

ప్రియాంక తల్లిదండ్రులు ఇద్దరూ డాక్టర్లే. ఆర్మీలో పని చేసేవారు. అందుకే ప్రియాంకకు డాక్టర్‌ చదవాలని ఉండేదట. ఆ తరవాత వ్యోమగామి అవ్వాలనుకొంది. కానీ అనూహ్యంగా సినిమాల్లోకి వచ్చింది. ‘‘నా రోల్‌ మోడల్‌ మా అమ్మే. తనే నా హీరో. తనకు 9 భాషలు వచ్చు. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన ఓ అమ్మాయి సినిమాల్లోకి అడుగుపెట్టాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్నిచ్చింది మా అమ్మే’’ అంటుంది ప్రియాంక. (Priyanka Chopra about her mother)

Priyanka1.jpg

Also Read: Preity Zinta: అతనే నన్ను వేధించాడు.. ఇలా జరిగితే మిస్ కాల్ ఇవ్వమంటూ..

నాన్న గుర్తుగా..

ప్రియాంక కుడి చేతిపై ‘డాడీస్‌ లిల్‌ గాళ్‌’ అంటూ ఆంగ్లంలో ఓ టాటూ కనిపిస్తుంటుంది. తండ్రిపై తనకున్న ప్రేమకు ఈ టాటూ ప్రతీక. 2013లో క్యాన్సర్‌తో ఆమె తండ్రి అశోక్‌ చోప్రా కన్ను మూశారు. అంతకు యేడాది ముందు తండ్రి స్వదస్తూరితో రాసిన ఈ వాక్యాన్ని టాటూగా తన చేతిపై వేయించుకుంది. (Priyanka Chopra buys Ring costs 1.5cr)

ఉంగరాల పిచ్చి

ఆభరణాలు పెద్దగా ఇష్టపడదు కానీ ఉంగరాలంటే పిచ్చి. అందులోనూ డైమండ్‌ రింగ్స్‌ తరచూ కొనుగోలు చేస్తుంటుంది. ప్రియాంక వెడ్డింగ్‌ రింగ్‌ అప్పట్లో ఓ హాట్‌ టాపిక్‌. దాని విలువ సుమారు కోటిన్నర. ఈ ఉంగరాన్ని లండన్‌లో ప్రత్యేకంగా డిజైన్‌ చేయించిందామె.

Priyanka3.jpg

ఫ్యాన్స్‌ ఎక్కువే..

అభిమానుల్ని సంపాదించుకోవడంలోనూ ప్రియాంకదే రికార్డు. ఇన్‌స్టాలో కోట్లాదిమంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అంకెలవారీగా చూస్తే మోదీ, అమితాబ్‌ బచ్చన్‌కంటే ప్రియాంకకే ఫాలోవర్స్‌ ఎక్కువ. వాళ్లతో ‘చోప్స్‌’ ఎప్పుడూ టచ్‌లో ఉంటుంది. ఫ్యాన్స్‌ అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇస్తుంటుంది.

‘అన్‌ఫినిష్డ్’.. బెస్ట్‌ సెల్లర్‌

ప్రియాంకలో ఓ రచయిత్రి కూడా ఉంది. ‘హిందూస్థాన్‌ టైమ్స్‌’ పత్రికలో ప్రియాంక కొన్ని వ్యాసాలు రాసింది. వాటితో తనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ వ్యాసాలన్నీ ‘అన్‌ఫినిష్డ్‌’ అనే పేరుతో 2019లో సంకలనం చేసింది. ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ బెస్ట్‌ సెల్లర్స్‌ లిస్టులో ఈ పుస్తకం స్థానం సంపాదించుకొంది.

బోలెడు నిక్‌నేమ్స్‌...

‘పిగ్గూ’, ‘చోప్స్‌’, ‘మిమి’, ‘దీదీ’... ఇవన్నీ ప్రియాంక ముద్దు పేర్లు. చిన్నప్పుడు తను బాగా తినేదట. దాంతో బొద్దుగా కనిపించేది. అందుకే ప్రియాంకని ‘పిగ్గూ’ అంటూ స్నేహితులు ఆట పట్టించేవారు. ప్రియాంకకు కజిన్స్‌ చాలామంది ఉన్నారు. వాళ్లంతా ‘మిమి’, ‘దీదీ’ అని పిలుచుకుంటారు.

‘యునిసెఫ్‌’ అంబాసిడర్‌

‘చిత్రసీమ నాకు ఇచ్చింది... ఇప్పుడు నా వంతు వచ్చింది’ అనే రొటీన్‌ మాటలు చాలామంది స్టార్లు చెబుతుంటారు. కానీ.. ఈ మాటని నిలబెట్టుకొంది ప్రియాంక. తన పేరుతో ఓ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు విద్య, ఆరోగ్యం, ఆహారం అందించడానికి ఈ ఫౌండేషన్‌ చేయూతనిస్తుంది. తన ఆదాయంలో 10 శాతం ఈ సంస్థకి కేటాయిస్తోంది ప్రియాంక. 2010లో యునిసెఫ్‌ తమ అంబాసిడర్‌గా ప్రియాంకని నియమించింది.

ఇవి కూడా చదవండి:

Sitara Ghattamaneni: ఎవరైనా నిన్ను ఫాలో అయితే పరిస్థితి ఏంటి?.. మహేశ్‌ కుమారైపై నెటిజన్ల విమర్శలు

Adipurush: మరో వివాదంలో ప్రభాస్ మూవీ.. తన ఆర్ట్ వర్క్‌ని దొంగిలించారంటూ..

Balagam: ‘బలగం’ ఖాతాలో మరో అవార్డు.. మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డులు గెలిచిందంటే..

Updated Date - 2023-04-09T16:44:28+05:30 IST